Jannaram | ముగ్గుల విజేతలకు బహుమతుల అందజేత

Jannaram | ముగ్గుల విజేతలకు బహుమతుల అందజేత

Jannaram | జన్నారం రూరల్, ఆంధ్రప్రభ : సంక్రాంతి పండుగకు ముందస్తుగా మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని కామనపెల్లి గ్రామ 1వ‌ వార్డు సభ్యుడు చాట్ల తిరుపతి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు ఈ రోజు నిర్వహించారు. ఆ తర్వాత విజేతలైన గ్రామానికి చెందిన కోడిజుట్టు మౌనిక ప్రథమ బహుమతి గెలుపొందగా, కోరుట్ల జ్యోతి ద్వితీయ, ఓడిపెళ్లి నికిత తృతీయ బహుమతులు గెలుపొందారు. వారికి బహుమతులను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ముగ్గులు వేశారు. మహిళల ముగ్గులు చూపర్లను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత పోటీలో పాల్గొన్న మహిళలందరికీ ప్రోత్సాహక బహుమతులు ఆయన అంద‌జేశారు.

Leave a Reply