అంబరాన్నంటిన జనసేనాని జన్మదిన వేడుకలు

నంద్యాల నూనెపల్లె, ఆంధ్రప్రభ: నంద్యాలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని జిల్లా నాయకులు, కార్యకర్తలు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం లైవ్ స్ట్రీమింగ్ ద్వారా యువజన విభాగం ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం పీఏఓ కాంప్లెక్స్ లో జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన యువజన నాయకులు రాచమడుగు చందు, సుందర్ లు ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

అనంతరం జనసేన పార్టీ రక్తనిధి ఆధ్వర్యంలో మహా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్ఎమ్డీ ఫిరోజ్, యువ నాయకులు తాతిరెడ్డి మనీష్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ కూటమిలో భాగంగా జనసేనను గత 6 సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న నంద్యాల జనసేనను అభినందించాలన్నారు. కార్యక్రమంలో జనసేన నాయకులు రాచమడుగు రాంబాబు, వీర మహిళ జయంతి, ఠాగూర్, సంజీవరాయు, వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.