శిరీష కుటుంబానికి న్యాయం చేయాలి
ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించాలి..
రూ.30 వేల ఆర్థిక సాయం అందజేసిన జనసేన నేత గడాల
ములకలపల్లి, ఆంధ్రప్రభ : హైదరాబాద్‌లో దారుణ హత్యకు గురైన ములకలపల్లి మండలం చౌటిగూడెం గ్రామానికి చెందిన ఊకే శిరీష కుటుంబాన్ని జనసేన పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ గడాల శ్రీనివాసరావు మంగళవారం పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. పార్టీ తరఫున రూ.30 వేల తక్షణ ఆర్థిక సాయాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ గడాల శ్రీనివాసరావు మాట్లాడుతూ శిరీష మృతి ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి న్యాయ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. ఘటనకు సంబంధించిన ఆసుపత్రి లైసెన్స్‌ను వెంటనే రద్దు చేయాలని కోరారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచి, కుటుంబంలో ఒకరికి నాలుగో తరగతి ప్రభుత్వ ఉద్యోగం కల్పించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు జనసేన పార్టీ అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. కుటుంబ సభ్యులకు అవసరమైన సహకారం అందించేందుకు పార్టీ నాయకులు ముందుంటారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఖమ్మం నియోజకవర్గ ఇన్‌చార్జి మిరియాల రామకృష్ణ, నాయకులు రాము యాదవ్, గరికె రాంబాబు, తాటికొండ ప్రవీణ్, పొడిచేటి చెన్నారావు, నక్కన రమేష్, నాగరాజు, నాగేంద్రబాబు, వీరమహిళలు కావ్య, రాజకుమారి తదితరులు పాల్గొన్నారు.
