JaiSamvidhan | పాఠ‌శాల‌లో శ్ర‌మ‌దానం చేసిన కాంగ్రెస్ నేత‌లు

అదిలాబాద్ – దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ లో భాగంగా ఒక గ్రామం నుండి మరో గ్రామం, ఒక పట్టణం నుండి మరో పట్టణం వరకు ప్రజాస్వామ్య, రాజ్యాంగ విలువలను రక్షించేందుకు, మహాత్మా గాంధీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఆలోచ‌న‌తో నేడు కాంగ్రెస్ నేత‌లు శ్ర‌మదానం కార్యక్రమాన్ని నిర్వ‌హించారు.. పాల్వంచ లోని కిన్నెరసాని గిరిజన బాలుర గురుకుల పాఠశాలలో ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు, పాఠశాల సిబ్బందితో కలిసి పాఠశాల ఆవరణంలో పిచ్చి మొక్కలను తొలగించి, చెత్తను శుభ్రం చేశారు. అనంత‌రం మొక్కలను నాటారు.

Leave a Reply