Jainoor | ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు గొప్పది

Jainoor | ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు గొప్పది

  • ప్రతిజ్ఞ చేసిన అధికారులు నాయకులు విద్యార్థులు

Jainoor | జైనూర్, ఆంధ్రప్రభ : ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో గొప్పదని ప్రతి ఓటు హక్కు గల వారు స్వచ్ఛందంగా, స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని జైనూర్ తాసిల్దార్ ఆడ బిర్షవ్ జైనూర్ సీఐ రమేష్ అన్నారు. ఈ రోజు మండల కేంద్రంలో జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలోని బాలికల అశ్రమొన్నత పాఠశాల విద్యార్థులచే ర్యాలీ నిర్వహించి, కొమరం భీం చౌరస్తాలో మానవ హారంగా ఏర్పడి ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా వారు ఓటు హక్కు వినియోగం వాటి ద్వారా కలిగే ప్రయోజనాలు 18 సంవత్సరాల నిండిన యువతి యువకులు ఓటు హక్కు కోసం పేర్లు నమోదు చేసుకోవాలని ఓటు హక్కు కలిగి ఉండాలని వారు కోరారు. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఎవరికీ ప్రలోభాలకు లొంగకుండా స్వచ్ఛందంగా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని తాసిల్దార్ ఆడ బిర్షవ్, సీఐ రమేష్ కోరారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు.

Jainoor

Leave a Reply