Jailer 2 OTT Release | రజనీ ఫ్యాన్స్ వెయిటింగ్‌కు తెర.. జైలర్ 2 వచ్చేది అప్పుడే!
ఆంధ్రప్రభ, సినిమా ప్రతినిధి: సూపర్‌స్టార్ రజనీకాంత్ మాస్ జోరుకు బాక్సాఫీస్ దగ్గర మరోసారి తిరుగులేదని నిరూపించిన సినిమా ‘జైలర్ 2’. థియేటర్లలో భారీ వసూళ్లతో దూసుకెళ్లి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే రూ.800 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా డిజిటల్ రిలీజ్ డేట్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో అధికారికంగా ప్రకటించింది. దీంతో రజనీ అభిమానులు ఓటీటీ ప్రీమియర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
‘జైలర్ 2’ డిజిటల్ ప్రీమియర్ నవంబర్ 12, 2026 నుంచి ప్రారంభం కానుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ అందుబాటులోకి రానుంది. థియేటర్లలో రజనీకాంత్ స్టైల్, యాక్షన్ సన్నివేశాలను చూసి ఎంజాయ్ చేసిన ప్రేక్షకులు ఇప్పుడు ఇంట్లోనే ఈ సినిమాను చూసేందుకు సిద్ధమవుతున్నారు.
ఈ సినిమాలో రజనీకాంత్‌తో పాటు భారీ తారాగణం సందడి చేసింది. ఎస్.జే. సూర్య, మిథున్ చక్రవర్తి, సూరజ్ వెంజరమూడు, విద్యా బాలన్, రమ్యకృష్ణన్, యోగిబాబు, మిర్నా, రిత్విక్, జతిన్ సర్నా, అన్నా రాజన్, నమో నారాయణ కీలక పాత్రల్లో నటించారు. ఇక అతిథి పాత్రల్లో మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, హృతిక్ రోషన్, విజయ్ సేతుపతి, జాకీ ష్రాఫ్, వినాయకన్ కనిపించడం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వీరి ఎంట్రీలు థియేటర్లలో అభిమానులకు మంచి కిక్ ఇచ్చాయి.
ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించడంతో ఇప్పుడు అభిమానుల్లో మరో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. థియేటర్లలో విడుదలైన వెర్షన్ కాకుండా ఓటీటీలో అదనపు సన్నివేశాలతో కూడిన ఎక్స్‌టెండెడ్ కట్ వస్తుందా? అన్నది ఆసక్తిగా మారింది. అయితే ఓటీటీ వెర్షన్‌లో అదనపు సన్నివేశాలు ఉంటాయా లేదా అనే విషయంపై ఇప్పటివరకు స్పష్టత లేదు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మించింది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. భారీ యాక్షన్, స్టార్ క్యాస్టింగ్, రజనీకాంత్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో థియేటర్లలో సందడి చేసిన ‘జైలర్ 2’ ఇప్పుడు ఓటీటీలో ఎలాంటి స్పందన అందుకుంటుందో చూడాలి. నవంబర్ 12 నుంచి డిజిటల్ వేదికపై మరోసారి రజనీ మేనియా మొదలుకానుంది.
