Jailer 2 | వచ్చేది ఎప్పుడు..?

Jailer 2 | వచ్చేది ఎప్పుడు..?
Jailer 2 | జైలర్ 2లో అతిథి పాత్రల్లో స్టార్ నటులు
బాలయ్య తర్వాత బాలీవుడ్ స్టార్ పేరు లీక్
షారుఖ్ ఖాన్ పాత్రపై సోషల్ మీడియాలో హల్చల్
జైలర్ 2 రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ను మళ్లీ ఫామ్ లోకి తీసుకువచ్చిన సినిమా జైలర్. ఈ మూవీకి డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్. ఇందులో రజినీకాంత్ ను అభిమానులు ఎలా చూడాలి అనుకుంటారో అలా చూపించడంతో.. జనాలకు బాగా నచ్చేసింది. బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇప్పుడు జైలర్ మూవీకి సీక్వెల్ జైలర్ 2 రూపొందుతోంది. అయితే.. ఇందులో స్టార్స్ గెస్ట్ రోల్స్ చేయనున్నారని గతంలో వార్తలు వచ్చాయి. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ గెస్ట్ రోల్ చేయనున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. ఇంతకీ.. ఆ బాలీవుడ్ స్టార్ ఎవరు..?

జైలర్ 2 లో గెస్ట్ రోల్ చేసే స్టార్స్ అంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. కోలీవుడ్ నుంచి విజయ్ సేతుపతి గెస్ట్ రోల్ లో కనిపిస్తారని.. ఆయన ఎంట్రీ డిఫరెంట్ గా ప్లాన్ చేసినట్టుగా తెలిసింది. ఇక మలయాళం నుంచి మోహన్ లాల్, కన్నడ నంచి శివరాజ్ కుమార్ గెస్ట్ రోల్స్ చేయనున్నారని టాక్. అయితే.. టాలీవుడ్ నుంచి నట సింహం బాలయ్య గెస్ట్ రోల్ లో పవర్ ఫుల్ పాత్ర చేస్తున్నట్టుగా ప్రచారం జరిగింది. అసలు జైలర్ మూవీకే బాలయ్యతో గెస్ట్ రోల్ చేయించాలి అనుకున్నారట. ఈసారి ఖచ్చితంగా జైలర్ 2 లో బాలయ్య కనిపిస్తారని గుసగుసలు వినిపించాయి కానీ.. మేకర్స్ నుంచి మాత్రం అఫిషియల్ గా ఎలాంటి కన్ ఫర్మమేషన్ రాలేదు.

తాజాగా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ గెస్ట్ రోల్ లో చేస్తున్నారనే వార్త లీకైంది. ఇంతకీ.. ఎవరా బాలీవుడ్ స్టార్ అంటే.. షారుఖ్ ఖాన్ పేరు వినిపిస్తుంది. అంతే కాకుండా.. ఆయన క్యారెక్టర్ 10 నుంచి 15 నిమిషాల పాటు కనిపిస్తుందని సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతుంది. అయితే.. ఇది నిజమా..? లేక గాసిప్పా..? అనేది తెలియాల్సివుంది. ఇదే కనుక నిజమైతే.. బాలీవుడ్ లో జైలర్ 2 కు మరింత క్రేజ్ రావడం ఖాయం. ఇక ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ కానుందంటే.. జూన్ 12న ఈ భారీ సీక్వెల్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

