జై హనుమాన్​ !
శ్రీమద్రామాయణము మానవాళికి లభించిన ఏకైక మహిమాన్విత అపూర్వ కావ్యము. త్రేతా యుగమున జరిగిన ధర్మస్వరూప శ్రీరాముని చరిత్ర. ఆ మహనీయుని దివ్య గాథను వాల్మీకి మహర్షి విశ్వమానవాళికి అందించారు. దుష్టశిక్షణ, శిష్టరక్షణ(discipline, discipline)కై మానవునిగా అవతరించిన శ్రీమహావిష్ణువే శ్రీరామ చంద్రుడను రహస్యమును మనకు విశదపరచిన వాల్మీకి(Valmiki) మహర్షి సదా పూజనీయుడు. రామాయణ మహానాయకుడు శ్రీరామ చంద్రుడైతే మహా భక్తదూత ఆంజనేయుడు ఉపనాయకుడు.

ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణు శివాత్మకం..
తరుణార్క ప్రభాశాంతం రామదూతమ్ నమామ్యహం..

త్రిమూర్త్యాత్మక శక్తిశాలి ఆంజనేయుడు. ప్రభుభక్తి పారాయణ, నిస్వార్థ సేవ, కార్యదక్షత, శౌర్య పరాక్రమము, నిర్భయత్వము మొదలగు మహా సద్గుణములు ప్రదర్శించిన గప్ప మార్గదర్శి హనుమ. ఈ బుద్ధిశాలి దివ్య గాథ రామాయణంలోని సుందరకాండ(Sundarakanda)లో సంపూర్ణంగా ప్రకాశిస్తుంది. ధర్మ నిరతిని కోరుకునే వారికి లంకా దహన కాండ బహు సుందరంగా కనబడుతుంది. అందు వలననే సుందరకాండ సుందరం. మరుతి రూపం మరే ఇతర దేవతా మూర్తికి లేదు.

ఏ కోణం నుండి చూసినా హనుమ రూపం మహాసుందరం. శ్రీరామచంద్రుని ధర్మ ప్రదర్శన ఒక అంశమైతే, ఒక నిస్వార్థ కార్యసాధన ఎంత పవిత్రతను సంతరించుకుంటుందో హనుమను పరిశీలిస్తే అవగతమవుతుంది. భక్తి ఎంత శక్తివంతమైనదో మారుతి యొక్క పరాక్రమం నిరూపిస్తుంది. పవిత్ర కార్యసాధకులకు(the pious practitioners) ఒక గొప్ప మార్గదర్శిగా అంజనీ సుతుడు అజిరామరంగా నిలిచాడు.

ఆధ్యంతం సుందర పుష్ప సౌరభాలైన మహిమాన్విత శ్లోక రాజాలతో ఉర్రూతలూగిస్తుంది సుందరకాండ. సాధకుల లక్ష్యం ఫల ప్రదమగుటకు కావలసిన ఉప కారణాలు లభిస్తాయి. కావలసినదల్లా భక్తి, విశ్వాసం. ఆత్మస్వరూపిణి సీతామాతను దర్శించి పరమాత్మ చెంతకు చేరి ఆయన ఆలింగన భాగ్యమును పొందిన చిరంజీవి హనుమ. రామ నామాంకిత భక్తి స్వరూపుడు ఆంజనేయుడు. సీతాన్వేషణ(Search for Sita)కై శత యోజన సంద్రమును జ్ఞానమను ప్రభు భక్తితో అవలీలగా దాటాడు.

కార్యసాధకులకు ప్రలోభములనే ఆటంకాలు మైనాకునిలా ఎదురవుతాయి. వాటి నుండి చాకచక్యంగా ఎలా తప్పించుకోవాలో హనుమ చూపించాడు. ఇంకా సురస రూపంలో ఎదురైన మహా విఘ్నాలను తన బుద్ధి బలమును గుర్తెరిగి ఎదుర్కొన్నాడు. సింహిక అను ఛాయా సౌఖ్యములు మారుతిని వెనుకకు లాగాయి. లక్ష్య సిద్ధి కొరకు వాటిని తృణ ప్రాయము చేసి అధిగమించాడు.

లక్ష్య ఛేదనకు తమో గుణం ఒక గొప్ప అవరోధము. తమో గుణ లంకిణి హనుమను అడ్డగించింది. తన శౌర్య బల పరాక్రమములను ప్రోది చేసుకుని లంకిణిని సంహరించి ముందుకు సాగాడు వీర హనుమ(Brave Hanuman). ధర్మ నిరతిని చేపట్టిన వారు అనేక ఉపాయములను ప్రయోగించ వలసిన అవసరం ఏర్పడుతుంది. అందుకే మారుతి లంకలో నేరుగా ప్రవేశించక ఉప ద్వారముల ద్వారా ప్రవేశించాడు.

ప్రకృతి స్వరూపమైన సీతమ్మ వారికి పురుషోత్తముడైన శ్రీరామచంద్రుని రామ నామాంకిత అంగుళీయకమును సమర్పించి సచ్చిదానందమును కలిగించాడు. కార్య సాధనలో విశ్వాసము ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. ఆ నమ్మకము యొక్క ప్రదర్శనయే కాకాసుర వృత్తాంతమును సీతమ్మ నుండి హనుమ గ్రహించుట. ఆత్మ-పరమాత్మ(Soul-Paramatma)ల, ప్రకృతి- పురుషుల కలయికను ముహూర్తమే హనుమకు సీతామాత చూడామణి ప్రదానము చేయుట.

దుష్ట శిక్షణకు ఆరంభమే లంకాదహనము. శిష్ట రక్షణకు సూచనయే విభీషణాది గృహములను విడిచి పెట్టుట. లక్ష్య సిద్ధికి సంకేతమే మధువన ప్రవేశము, విందు, బుద్ధిమంతులకు, భక్తి పరులకు జ్ఞానము, బలము, యశము, కీర్తి, తుదకు బ్రహ్మనందము లభించి జన్మ బహు సుందరమూ వెలుగొదునని సుందరకాండలో హనుమ సందేశంగా మనమంతా గ్రహించి పవిత్ర కార్య సాధకులమై నిలవాలి.


-వారణాశి వెంకట సూర్యకామేశ్వరరావు

Leave a Reply