జ‌గిత్యాల కోర్టు ఆదేశాలు

జ‌గిత్యాల కోర్టు ఆదేశాలు

జగిత్యాల, ఆంధ్రప్రభ : జగిత్యాల ఆర్డీవో కార్యాలయ సామాగ్రిని జప్తు చేయాలని ఈ రోజు జగిత్యాల కోర్టు(Court of the Worlds) ఆదేశాలు జారీ చేసింది. పెద్దపల్లి-నిజామాబాద్‌ రైల్వే లైన్‌(Railway Line) కోసం జగిత్యాల ప్రాంత రైతుల నుంచి తీసుకున్న వంద‌ ఎకరాల భూమిని తీసుకోగా, రైల్వే లైను కోసం తీసుకున్న భూములకు రైతులకు పరిహారం చెల్లించ లేదు. 2006లో ఒక ఎకరా రూ.1.30 లక్షలు ప్రభుత్వం(Govt) చెల్లించగా, ఆ పరిహారం చాలదని రైతులు(Farmers) కోర్టును ఆశ్రయించారు.

హైకోర్టు, సుప్రీం(High Court, Supreme) కోర్టులోనూ రైతులకు ఎకరా రూ.15,97,200 చెల్లించాలని గతంలోనే ఆదేశాలు జారీ అయ్యాయి. కోర్టు ఆదేశించినా పరిహారం ఇవ్వకపోవటంతో రైతులు జిల్లా కోర్టును ఆశ్ర‌యించారు. దీంతో ఆర్డీఓ కార్యాలయ సామాగ్రిని జప్తు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Leave a Reply