Jaggayyapeta | గ్రామాల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత
- గౌరవరం గ్రామంలో 61 లక్షల అభివృద్ధి పనులు
- పల్లె పండుగ 2.0 ద్వారా గ్రామ సీమల అభివృద్ధి
- ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య
- జిల్లా కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురాం
Jaggayyapeta | జగ్గయ్యపేట, ఆంధ్రప్రభ : గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య, జిల్లా కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురాంలు అన్నారు. జగ్గయ్యపేట మండలం గౌరవరం గ్రామంలో రూ.61 లక్షల నిధులతో వివిధ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య, జిల్లా కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురాంలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈసందర్భంగా గ్రామంలో 16 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన గోకులం షెడ్ లను, 30 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్లను ఎమ్మెల్యే తాతయ్య, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాంలు ప్రారంభించారు. రూ.15 లక్షల నిధులతో నూతనంగా నిర్మించనున్న సిమెంట్ రోడ్లకు భూమిపూజ చేశారు.
అనంతరం ఎమ్మెల్యే తాతయ్య, నెట్టెం రఘురాం లు మాట్లాడుతూ… గౌరవరం గ్రామంలో రూ.61 లక్షల నిధులతో వివిధ అభివృద్ధి పనులు చేసుకోవడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో మౌలిక సదుపాయాల కల్పనలకు ప్రత్యేక ప్రణాళిక ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళుతున్నట్లు వివరించారు. గ్రామాల అభివృద్ధికి రాష్ట్రం లో పల్లె పండుగ 2.0 వంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. బస్సు పోషణకు ప్రోత్సహించేందుకు గోకులం షెడ్లను నిర్మాణం రైతులకు అవసరమైన సదుపాయాలు సహకారం ప్రభుత్వం తెలిపారు. పేద ప్రజలకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ద్వారా ఆదాయ మార్గాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.
మహిళల ఆర్థిక స్వలంబన సాధించేందుకు స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేస్తూ వారికి రుణాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. వైద్య, విద్యా రంగాల్లో గణనీయమైన మార్పులు ప్రభుత్వం తీసుకువచ్చినట్లు తెలిపారు. గ్రామాలను కూడా అభివృద్ధిలో ముందుంచే విధంగా ప్రభుత్వం ముందుకు వెళుతున్నట్లు వివరించారు.
ఈకార్యక్రమంలో ఎంపీడీవో జి.నితిన్, జగ్గయ్యపేట మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గౌరవరం సొసైటీ చైర్మన్ కట్ట వెంకట నరసింహారావు, గ్రామ సర్పంచ్ ముత్తవరపు పావని వెంకటేష్, మార్కెట్ యార్డ్ చైర్మన్ మల్లెల సీతమ్మ, ఏపీవో రామకృష్ణ, శేషగిరి, మహేష్, బుచ్చిబాబు, సయ్యద్ జాన్ బాషా, కొప్పుల నాగేశ్వరరావు, కుక్కల జగదీష్, కొప్పుల రాము, బాజినీడి ధన మూర్తి, కోట వీర రాఘవయ్య, కొమ్మినేని వెంకటరావు, పఠాన్ మహమ్మద్ ఖాన్, గ్రామస్తులు పాల్గొన్నారు.

