JAGGA REDDY | కళ్యాణి మహేష్ గౌడ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలి : నిర్మల జగ్గారెడ్డి
JAGGA REDDY | సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : బేగంపేట తండాలో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్న కళ్యాణి మహేష్ గౌడ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలజగ్గారెడ్డి బేగంపేట గ్రామస్తులను కోరారు. ఈ రోజు కంది మండలం బేగంపేట్ – తండా లో కాంగ్రెస్ పార్టీ తరుఫున ఆమె ప్రచారం నిర్వహించారు. గత పదేళ్ల కాలంలో బేగంపేట్ లో అభివృద్ధి కుంటుపడిందని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో జగ్గారెడ్డి సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామని అన్నారు. గ్రామంలో గత పాలకులు కబ్జాలకు పాల్పడుతున్నారని ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉండొద్దంటే కళ్యాణి మహేష్ గౌడ్ లకు ఉంగరం గుర్తు పై ఓటు వేసి ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జి ఆంజనేయులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రఘురాంగౌడ్, రాంసింగ్ నాయక్, కళ్యాణి బాబూగౌడ్, కోనాపురం ఆంజనేయులు, వార్డు అభ్యర్థులు గ్రామ పెద్దలు మహిళలు, యువకులు పాల్గొన్నారు.

