YS Jagan | అంద‌రి లెక్క‌లు తేలుద్దాం…

YS Jagan | అంద‌రి లెక్క‌లు తేలుద్దాం…

YS Jagan | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. తాడేపల్లిలోని నివాసంలో వైఎస్ జగన్ (YS Jagan) తో కలిసి అంబటి మాట్లాడారు. అంబటి రాంబాబు ఇటీవ‌లు అరెస్ట్ అయి.. గురువారం బెయిల్ పై విడుదలైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయ‌న‌ తనపై టీడీపీ ప్రభుత్వం (TDP government) పెట్టిన కేసులు, టీడీపీ రౌడీ మూకలు తన ఇంటిని ధ్వంసం చేసిన తీరు, హత్యాయత్నం, పోలీసుల నిర్లిప్త వైఖరి వంటి అంశాలను వైఎస్ జగన్ కు వివరించారు.

ఈక్రమంలో తప్పుడు కేసులపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, చట్టపరంగా ఎదుర్కొందామని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ వ్యవహరిస్తున్న కొంతమంది పోలీసు అధికారుల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ప్రజల పక్షాన, ప్రజల తరపున చేస్తున్న పోరాటంలో ఎదురయ్యే ఆటంకాలు, వేధింపులు ధీటుగా ఎదుర్కొని ప్రజలకు అండగా నిలుద్దామని, పార్టీ నాయకులు, కేడర్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.

Leave a Reply