ఇటాలియన్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో మూడో సీడ్ కార్లోస్ అల్కరాజ్, ఐదో సీడ్ జాక్ డ్రాపర్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ రౌండ్-16 మ్యాచ్‌లో స్పెయిన్ యువ స్టార్, ప్రపంచ 3వ ర్యాంకర్ కార్లోస్ అల్కరాజ్ 6-3, 3-6, 7-5 తేడాతో రష్యాకు చెందిన 23వ సీడ్ కారెన్ కచనోవాపై చెమటోడ్చి నెగ్గాడు.
మరో మ్యాచ్‌లో యూకే స్టార్, ప్రపంచ 5వ ర్యాంకర్ జాక్ డ్రాపర్ 1-6, 6-4, 6-3 తేడాతో కొరెంటిన్ మౌటెట్ (ఫ్రాన్స్)పై విజయం సాధించి టోర్నీలో ముందంజ వేశాడు.
సెమీస్‌లో పౌలీని..
మహిళల సింగిల్స్‌లో ఇటలీ స్టార్, ప్రపంచ 6వ ర్యాంకర్ జాస్మిన్ పౌలీని సెమీస్‌లోకి దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో పౌలీని 6-7 (1/7), 6-4, 6-2 తేడాతో 13వ ర్యాంకర్ డయానా ష్నాయిడర్ (రష్యా)ను ఓడించి టైటిల్‌కు చేరువైంది. అంతకుముందు జరిగిన ప్రి క్వార్టర్స్‌లో వరల్డ్ నం.1 అరీనా సబలెంకా 6-1, 7-6 (10/3)తో మార్ట కోస్టియుక్‌పై చెమటోడ్చి నెగ్గింది.