జీఎస్టీ సంస్కరణలతో నష్టముంటే కేంద్రం దృష్టికి తీసుకెళ్లొచ్చు!
- కేంద్రం హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
ఉమ్మడి కరీంనగర్ బ్యూరో, ఆంధ్రప్రభ : జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు జరిగిన నష్టమేమిటో చెప్పకుండా పనికిమాలిన మాటలు మాట్లాడటం సరికాదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్(Bandi Sanjay Kumar) అన్నారు. నిజంగా జీఎస్టీ సంస్కరణలవల్ల ఏదైనా సమస్య ఉంటే ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ రోజు కరీంనగర్ లో కొండా లక్ష్మణ్ బాపూజీ(Konda Laxman Bapuji)వర్దంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ మేయర్ సునీల్ రావు(Sunil Rao) తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మాటల్లో…
జీఎస్టీపై పెద్ద ఎత్తున సంస్కరణలు తెచ్చాం. రేపటి నుండి జీఎస్టీ(GST) కొనుగోలు దారులకు, అమ్మకం దారులను సనన్మానిస్తాం. దురదృష్టమేంటంటే సౌత్, నార్త్ అంటూ పనిలేనోళ్లు పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారు. ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) సౌత్ వ్యక్తి. ఏమైనా ఇబ్బందులుంటే ఆమెతో మాట్లాడి సమస్య ఉంటే పరిష్కరించుకోవచ్చు. లేకుంటే నష్టం జరిగితే మీడియా ద్వారా ప్రజలకు చెప్పవచ్చు. అట్లాకాకుండా అడ్డగోలుగా మాట్లాడితే ఎట్లా? అలాంటివారికి ప్రజలే బుద్ది చెబుతారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తన ఇంటినే త్యాగం చేసి, కేసీఆర్(KCR) మొదట పార్టీ పెడతానంటే తన ఇంటినే టీఆర్ఎస్ ఆఫీస్ గా మార్చి తెలంగాణ రాష్ట్ర అంకుర్పారణకు చేసిన మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ. ఈ రో జు ఆ మహనీయుడి వర్దంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ ఆయనను స్మరించుకునే అవకాశం వచ్చింది.
- నమ్మిన సిద్ధాంతాల కోసం జీవితాన్ని ధారపోసిన మహనీయుడు బాపూజీ. బడుగు బలహీనవర్గాల అభ్యున్నతి కోసం శక్తివంచన లేకుండా కృషి చేసిన నాయకుడు. చేనేత, చేతివృత్తుల కార్మికుల(artisan workers) కంచంలో అన్నం మెతుకుగా మారిన మానవతావాది కొండా లక్ష్మణ్ బాపూజీ. స్వాతంత్ర్య ఉద్యమంలో గాంధీ టోపీ పెట్టుకుని ‘సిటిజన్ ప్రొటెక్షన్ కమిటీ(Citizen Protection Committee)’ పేరుతో పౌర హక్కుల కోసం పోరాడి అనేక సార్లు జైలుకు వెళ్లిన యోధుడు.
- తన జీవితమంతా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, బలహీనవర్గాలకు రాజ్యాధికారం అనే లక్ష్యాల కోసం అలుపెరగని పోరాటం చేసిన యోధుడు(Yodhudu) కొండా లక్ష్మణ్ బాపూజీ. నిజాం రాజును అంతమొందిస్తే తప్ప హైదరాబాద్ సంస్థాన ప్రజలకు విముక్తి లేదని భావించిన బాపూజీ మీర్ ఉస్మాన్ అలీఖాన్‌పై బాంబు దాడికి వ్యూహం రచించి అమలు చేసిన వ్యూహకర్త. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో నిర్బంధించబడిన నాయకులకు పార్టీలతో నిమిత్తం లేకుండా ఉచిత న్యాయ సహాయం అందించిన గొప్ప న్యాయవాది ఆయన.
- పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉపసభాపతిగా, మంత్రిగా, శాసనసభ్యునిగా మచ్చలేని నాయకుడిగా సేవలందిస్తూ ఈ తరం నాయకులకు స్పూర్తిగా నిలిచిన మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ. తెలుగు నేలపై సైకిల్ యాత్ర(Cycle Yatra), పాదయాత్రలకు శ్రీకారం చుట్టిన మొట్ట మొదటి వ్యక్తి. ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిన నాయకుడు కొండా లక్ష్మణ్. ‘తెలంగాణ పీపుల్స్ పార్టీ’ స్థాపించి ప్రత్యేక రాష్ట్ర కాంక్షను చాటిన బాపూజీ తన నివాసమైన ‘జలదృశ్యం(Water Viewస)’ లోనే తెలంగాణ రాష్ట్ర సమితికి పురుడు పోశారు. 96 ఏళ్ల ప్రాయంలో కూడా ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో తెలంగాణ కోసం దీక్ష చేశారంటే బాపూజీకి తెలంగాణపట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం.
- బాపూజీ విలువలు, త్యాగం, పట్టుదల, నిజాయితీ, పోరాట స్పూర్తి ఈ తరానికి ఆదర్శనీయం. ఈ సందర్భంగా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేదొక్కటే. ఆ మహనీయుడు(Mahenidu) చేసిన త్యాగాలను, నిజాయితీని నేటి తరానికే కాదు, భవిష్యత్తు తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. అందుకే కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి, వర్ధంతిని ఊరూవాడా అధికారికంగా జరుపుకునేలా కార్యక్రమాలు నిర్వహించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉంది.
ప్రధాని నరేంద్రమోదీ పుట్టినరోజును పురస్కరించుకుని ఈనెల 17 నుండి అక్టోబర్ 2 వరకు సేవా పక్షోత్సవాలు నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా రేపటి నుండి 29 వరకు ప్రతి రోజు జీఎస్టీ సంస్కరణ వల్ల జరిగిన ప్రయోజనాలపై ప్రజల్లో విస్త్రత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం.

