Israel |10 మిస్సైళ్లతో నార్త్ కొరియా ఎటాక్

Israel | 10 మిస్సైళ్లతో నార్త్ కొరియా ఎటాక్

Israel | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గత రెండు వారాలుగా అమెరికా-ఇజ్రాయెల్, ఇరామ్ మధ్య యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఉత్తర కొరియా కూడా యుద్ధానికి సిద్ధమవుతోంది.

జపాన్‌ వైపు సముద్రంలో 10 బాలిస్టిక్‌ మిసైళ్లను ప్రయోగించింది. ఈ విషయాన్ని దక్షిణ కొరియా ధ్రువీకరించింది. రాజధాని ప్యాంగ్‌యాంగ్‌ సమీపం నుంచి ఈ క్షిపణులు ప్రయోగించినట్లు పేర్కొంది. అయితే అమెరికాతో కలిసి దక్షిణకొరియా చేపట్టిన సంయుక్త విన్యాసాలకు ప్రతిగా క్షిపణులు ప్రయోగించినట్లు తెలుస్తోంది. నిఘాను పెంచినట్లు, ఈ విషయాన్ని అమెరికా, జపాన్‌తో పంచుకున్నట్లు దక్షిణకొరియా వెల్లడించింది.

Israel |

CLICK HERE TO READ MORE : Meeting | కేంద్రమంత్రిని కలిసిన మంత్రి సీతక్క

CLICK HERE TO READ MORE

Leave a Reply