Iran War Shock | స్టాక్ మార్కెట్ ధ్వంసం

Iran War Shock | స్టాక్ మార్కెట్ ధ్వంసం

Iran War Shock | ఇరాన్ యుద్ధ ప్రభావం: ప్రపంచ మార్కెట్లకు షాక్
రూ.20 లక్షల కోట్ల సంపద ఆవిరి… సెన్సెక్స్, నిఫ్టీ పతనం
క్రూడ్ ఆయిల్ ధరల జ్వాల… బ్రెంట్ $82 దాటింది
రిలయన్స్, అదానీ సహా హెవీవెయిట్ షేర్లకు భారీ నష్టం
బ్యాంకింగ్, ఆటో, ఆయిల్ రంగాలు విలవిల
హోర్ముజ్ జలసంధి ప్రతిష్టంభన… గ్లోబల్ సరఫరాకు బ్రేక్
భారత్‌పై ప్రభావం ఎంత తీవ్రం?
దుబాయ్, అబుదాబి స్టాక్ మార్కెట్లు క్లోజ్

Iran War Shock | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్; ఆమెరికా ఇజ్రాయెల్ జాయింట్​ ఆప‌రేష‌న్ రోర్ ల‌య‌న్ విక‌టించింది. త‌మ సుప్రీం లీడ‌ర్ అయాతుల్లా ఖ‌మేనీ స‌హా 40 మంది అగ్ర‌శేణి అధికారులు మ‌ర‌ణం.. ఇరాన్ రెవెల్యూష‌న‌రీ గార్డ్స్ హెడ్ క్వార్ట‌ర్స్ ధ్వంసంతో.. ఇరాన్ ఆగ్ర‌హంతో చెల‌రేగింది. ఇజ్రాయెల్ పై ముప్పేట దాడికి దిగింది. ఇక అమెరికాకు సైనిక విడిది స్థావ‌రాల‌కు అవ‌కాశం ఇచ్చిన‌.. ఇరాక్ స‌హా గ‌ల్ఫ్ దేశాల‌పై క్షిప‌ణుల‌తో.. డ్రోన్ల‌తో విరుకుప‌డింది. ఇంకా ఈ దాడి కొన‌సాగుతూనే ఉంది.

Iran War Shock : భార‌త్ కు పెద్ద దెబ్బ‌..

Iran War Shock

ఈ యుద్ధం ప్ర‌పంచ దేశాల‌పై మ‌రీ ముఖ్యంగా భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై తీవ్ర ప్ర‌భావం చూపుతోంది. అంత‌ర్జాతీయ చ‌మురు మార్కెట్ మండి పోతోంది. ఎగుమ‌తులు, దిగుమ‌తులకు బ్రేక్ ప‌డింది. ఫ‌లితంగా భార‌త షేర్ మార్కెట్ కుప్ప‌కూలింది. షేర్ మార్కెట్ లావాదేవీలు ప్రారంభ‌మైన కొన్ని నిముషాల్లోనే రూ. 20 లక్షల కోట్ల సంపద ఆవిరి కాగా.. ఆదానీ, రియలన్స్​ కంపెనీలు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. ఈ రోజు ఉదయం నుంచి భారత షేర్​ మార్కెట్​ విధ్వంస ప్రక్రియ ఇలా ఉంది.

Iran War Shock : రూ. 20 లక్షల కోట్లు ఆవిరి

Iran War Shock

పశ్చిమ ఆసియాలో ఇరాన్​, ఇజ్రాయెల్​ మధ్య ఉద్రిక్తతను,,దారి తీసిన పరిస్థితిని అంచనా వేసిన మదుపర్లు.. మండే కోసం ఎదురు చూశారు. భారత షేర్ మార్కెట్ సోమ‌వారం భారీ విధ్వంసంతోనే తొలి అడుగు ప‌డింది. పశ్చిమ ఆసియాలో యుద్ధ ఉద్రిక్తతలు పెరగడంతో ఇన్వెస్టర్లు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ట్రేడింగ్ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే ఇన్వెస్టర్ల సంపద సుమారు రూ. 18.43 లక్షల కోట్లు ఆవిరైపోయింది.

బీఎస్‌ఈ (BSE) లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ గత సెషన్‌లో రూ. 463.91 లక్షల కోట్లు ఉండగా, నేడు అది రూ. 445.47 లక్షల కోట్లకు పడిపోయింది. సెన్సెక్స్ ఏకంగా 2,743 పాయింట్లు పతనమై 78,543 వద్ద ప్రారంభం కాగా, నిఫ్టీ 519 పాయింట్లు నష్టపోయి 24,659 స్థాయిని తాకింది. మార్కెట్ భయాందోళనలను వ్యక్త పరిచే India VIX సూచీ 17% మేర పెరిగింది,

Iran War Shock : క్రూడ్ ఆయిల్ ధ‌రాఘాతం

Iran War Shock

గ్లోబల్ మార్కెట్‌లో ముడి చమురు ధరలు సుమారు 10% మేర పెరిగాయి. ఒక బేర‌ల్ బ్రెండ్ క్రూడ్ ఆయిల్ ధ‌ర ఫిబ్రవరి 27న సుమారు $ 73 (రూ.6,672లు) ఉంటే, మార్చి 2 నాటికి గరిష్టంగా $ 82.37 (రూ. 7,528లు) కు చేరుకుంది. సుమారు 13% వరకు పెరిగింది. WTI క్రూడ్ (US Crude oil ) $ 67 నుంచి $75.33 కు పెరిగింది. అంటే పెరుగుద‌ల శాతం 7% నుండి 10% కి చేరింది. చ‌యురు ధ‌ర‌ల ప్ర‌భావం స్టాక్ మార్కెట్ పై తీవ్ర ప్ర‌భావం చూపింది.

Iran War Shock : షేర్ మార్కెట్ విల‌విల‌

Iran War Shock

ప‌శ్చిమాసియాలో యుద్ధ వాతావ‌ర‌ణం నేప‌థ్యంలో ముడి చమురు ధరలు పెరగడంతో ఉత్పత్తి ఖర్చులు పెరిగి మార్జిన్లు దెబ్బతింటాయనే ఆందోళనతో ఆయిల్ & గ్యాస్ , పెట్రోకెమిక ల్స్ కంపెనీలు ప‌తనమయ్యాయి. ఇండెక్స్ హెవీవెయిట్ కావడంతో మార్కెట్ పతనంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) ప్రధాన పాత్ర పోషించింది. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు BPCL, HPCL, IOC: భారీ నష్టాలను చవిచూశాయి.

ఇక‌ పెయింట్స్ టైర్ రంగాల్లో వీటి ముడిసరుకుల్లో ఎక్కువ శాతం చమురు ఉత్పత్తులే ఉంటాయి. చమురు ధరలు పెరిగితే వీటి లాభాలు తగ్గుతాయి. ఈ స్థితిలో ఏషియన్ పెయింట్స్ (Asian Paints), బెర్జర్ పెయింట్స్ (Berger Paints) MRF, అపోలో టైర్స్ (Apollo Tyres)కంపెనీలు న‌ష్ట‌పోయాయి. వడ్డీ రేట్లు పెరగవచ్చనే అంచనాలు, రవాణా ఖర్చుల భయంతో ఆటోమొబైల్ రంగంలో షేర్లు పడిపోయాయి. మారుతీ సుజుకీ (Maruti Suzuki), టాటా మోటార్స్ (Tata Motors), మహీంద్రా & మహీంద్రా (M&M) కంపెనీల ఫేర్లు ప‌డిపోయాయి.

Iran War Shock

తమ పెట్టుబడులను విదేశీ ఇన్వెస్టర్లు (FIIs) ఉపసంహరించుకోవడంతో బ్యాంకింగ్ , ఫైనాన్షియల్ సర్వీసెస్‌, బ్యాంకింగ్ రంగంలో షేర్లు కుప్పకూలాయి. HDFC బ్యాంక్ , ICICI బ్యాంక్ ,SBI (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) షాక్ కు గుర‌య్యాయి. (Nifty 50 లో ఈ రోజు ట్రేడింగ్‌లో సుమారు 5% నుంచి 8% వరకు కొన్ని ప్రముఖ కంపెనీలు న‌ష్టాలను మూట‌గ‌ట్టుకున్నాయి. యుద్ధ ప్రభావంతో మధ్యప్రాచ్యంలో భారీ ప్రాజెక్టుల సముద్ర రవాణాకు ఆటంకం కలుగుతుందనే భయంతో.అదానీ పోర్ట్స్ (Adani Ports), గ్లోబల్ డిమాండ్ తగ్గుతుందనే ఆందోళనతో టాటా స్టీల్ (Tata Steel): ,లార్సెన్ & టూబ్రో (L&T) కంపెనీలు తీవ్రంగా న‌ష్ట‌పోయాయి.

Iran War Shock : ముడి చ‌మురు స‌ల‌స‌ల‌

Iran War Shock

తన చమురు అవసరాలలో 88.6% విదేశీ దిగుమతుల ద్వారానే భారతదేశం తీర్చుకుంటోంది. భారతదేశం దిగుమతి చేసుకునే మొత్తం క్రూడ్ ఆయిల్‌లో దాదాపు 40% కంటే ఎక్కువ హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) గుండానే వస్తుంది. ప్రస్తుతం రష్యా భారతదేశానికి అతిపెద్ద సరఫరాదారుగా ఉన్నప్పటికీ, ఇరాక్, సౌదీ అరేబియా , యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) వంటి మధ్యప్రాచ్య దేశాల నుండి వచ్చే చమురు రవాణాకు ఈ మార్గమే కీలకం.

Iran War Shock

ప్రస్తుతానికి భారతదేశం వద్ద 10 రోజుల రిఫైనరీ నిల్వలు, సుమారు 3 వారాల వ్యూహాత్మక చమురు నిల్వలు (Strategic Petroleum Reserves) అందుబాటులో ఉన్నాయి. (OMCs): Indian Oil (IOCL), BPCL, HPCL త‌దిత‌ర ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు పెరిగినప్పటికీ, దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచకపోతే వీటి మార్కెటింగ్ మార్జిన్లు భారీగా పడిపోతాయి. ONGC, Oil India వంటి ముడి చమురును ఉత్పత్తి చేసే సంస్థలకు ఇది కలిసొచ్చే అంశం. అంతర్జాతీయ ధరలు పెరిగితే వీరు విక్రయించే చమురుకు అధిక ధర లభిస్తుంది.

Iran War Shock : హోర్ముజ్ జలసంధి స్థంభ‌న

Iran War Shock

ప్ర‌పంచ దేశాల‌కు చ‌మురు ర‌వాణాకు ఏకైక జ‌ల మార్గం హోర్ముజ్ జలసంధి. ఈ మార్గంలో ఏ నౌకను ఇరాన్ రివ‌ల్యూష‌న‌రీ గార్డ్స్ ముందుకు క‌ద‌ల‌నీయ‌టం లేదు. ఇప్ప‌టికి నుమతించబోమని హెచ్చరికలు జారీ చేశాయి. దీనివల్ల దాదాపు 150 ట్యాంకర్లు సముద్రంలో ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ప్రపంచ చమురు అవసరాల్లో దాదాపు 20 % ఈ మార్గం గుండానే సరఫరా అవుతుంది.

Iran War Shock

ఈ ప్రతిష్టంభన కొనసాగితే అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ధర $100 డాలర్ల మార్కును దాటే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చమురు ధరలో ప్రతి $ 1 (ఒక డాల‌రు) పెరుగుదల, భారతదేశ వార్షిక దిగుమతి బిల్లుపై సుమారు $ 2 బిలియన్ల (రూ. 18,200 కోట్లు) భారాన్ని మోపుతుంది.

Iran War Shock : దుబాయ్​ మార్కెట్​ క్లోజ్​

Iran War Shock

పెట్టుబడిదారుల భద్రత, మార్కెట్ స్థిరత్వం దృష్ట్యా దుబాయ్, అబుదాబి స్టాక్ మార్కెట్లను మార్చి 2, మార్చి 3 తేదీల్లో రెండు రోజుల పాటు పూర్తిగా మూసివేస్తున్నట్లు UAE ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఇదే సమయంలో భద్రతా కారణాలతో UAE, ఖతార్ వంటి గల్ఫ్ దేశాలు విమాన మార్గాలను మూసివేయడంతో వేలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లో చిక్కుకుపోయారు. దుబాయ్, అబుదాబి, దోహా వంటి ప్రధాన ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిణామాలు గల్ఫ్ ఆర్థిక వ్యవస్థలపైనా, అంతర్జాతీయ వాణిజ్యం, ప్రయాణాలపైనా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.

Leave a Reply