AP | ఐపీఎస్ అధికారి అరెస్ట్

AP | ఐపీఎస్ అధికారి అరెస్ట్
AP | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఏపీ డిప్యూటీ స్పీకర్ (AP Deputy Speaker) రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో మాజీ సీఐడీ డీఐజీ, బీహార్ క్యాడర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ (IPS officer Sunil Nayak) ను ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు (Raghuramakrishna Raju) కస్టోడియల్ టార్చర్ కేసులో సునీల్ నాయక్ నిందితుడిగా ఉన్నారు. ఆ సమయంలో ఆయన సీఐడీ డీఐజీగా పనిచేశారు. గుంటూరు నగరంపాలెం పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. బిహార్‌లో ఆయనను ఏపీ పోలీసులు ట్రాన్సిట్ వారెంట్‌పై ఫ్లైట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొస్తున్నారు.
