IPL 2026 | ఈసారి కూడా అంతే !

IPL 2026 | ఈసారి కూడా అంతే !

ఆంధ్రప్రభ : ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్‌) 2026 సీజన్‌కి సంబంధించిన హడావిడి మొదలైంది. ఇప్పటికే పలు ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ జాబితాలను ఖరారు చేయగా, మరికొన్ని జట్లు ప్లేయర్ ఎక్స్చేంజ్ డీల్స్‌లో బిజీగా ఉన్నాయి. మిగిగా జ‌ట్లు కూడా తమ రిటెన్షన్ జాబితాలను నవంబర్‌ 15లోపు బీసీసీఐకి సమర్పించాల్సి ఉంటుంది.

IPL మ‌ళ్లీ విదేశాల్లోనే…

తాజాగా, ఐపీఎల్‌ 2026 వేలానికి సంబంధించిన తేదీ కూడా ఖరారైంది. 19వ ఐపీఎల్‌ సీజన్‌కి సంబంధించిన వేలం డిసెంబర్‌ 16న అబుదాబిలో జరగనుందని స్పోర్ట్‌స్టార్ వర్గాలు వెల్లడించాయి. అయితే, వరుసగా మూడోసారి కూడా భారత్ బ‌య‌టే ఐపీఎల్‌ వేలం జరుగబోతోంది. 2023లో దుబాయ్‌లో మొదటిసారి వేలం నిర్వహించగా, 2024లో సౌదీ అరేబియా వేదికైంది.

ఇటీవ‌ల ఈసారి మినీ వేలం భారత్‌లో జరగవచ్చన్న ఊహాగానాలు ఉన్నా, పలు కారణాల వల్ల బీసీసీఐ మళ్లీ విదేశాల్లోనే నిర్వహించాలని నిర్ణయించింది.

ఆర్ఆర్ కెప్టెన్ గా జ‌డ్డూ…?

ఇదిలా ఉండగా, చెన్నై సూపర్ కింగ్స్‌ (CSK), రాజస్థాన్ రాయల్స్‌ (RR) జట్ల మధ్య ఆసక్తికరమైన రవీంద్ర జడేజా – సంజు సామ్‌సన్ ట్రేడ్‌ ఒప్పందంపై చర్చలు జోరుగా సాగుతున్నాయి.

IPL

సంజు సామ్‌సన్‌ను విడిచిపెట్టే క్రమంలో రాజస్థాన్‌ రాయల్స్‌ మరో ఆటగాడిని కూడా కోరుతున్నట్లు సమాచారం. ఇద్దరి మార్కెట్‌ విలువలు సుమారు రూ.18 కోట్లుగా ఉండగా, చెన్నై సూపర్ కింగ్స్‌ మాత్రం డైరెక్ట్‌ స్వాప్ పై ఆసక్తి చూపిస్తోంది. అయితే, అవసరమైతే మరో ఆటగాడిని ఇవ్వడానికి సిద్ధంగా ఉందని తెలుస్తోంది.

అదేవిధంగా, సామ్‌ కరన్ కూడా ఈ ట్రేడ్‌ డీల్‌లో భాగమయ్యే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది. ఈ ఒప్పందం ఖరారైతే, రాజస్థాన్ రాయల్స్‌ కెప్టెన్‌గా జడేజా బాధ్యతలు చేపట్టే అవకాశముందని సమాచారం. అయితే, ఈ విషయమై రెండు ఫ్రాంచైజీలు ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.

IND vs SA | మూడు ఫార్మాట్ల‌ పోర‌కు సన్నద్ధం..

Leave a Reply