- కరుణించిన వరుణుడు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ ) 2025 సీజన్ కు రంగం సిద్ధమైంది. ఐపీఎల్ 2025 ప్రారంభ మ్యాచ్‌కు వేదికైన కోల్‌కతాలో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించగా… వరుణ దేవుడు కరుణించాడు. గత ఆరు గంటలుగా అక్కడ వర్షం కురవడం లేదు. దీంతో రాత్రి 7.30 గంటలకు కేకేఆర్ – ఆర్సీబీ మధ్య మ్యాచ్ ప్రారంభమం కానుంది. ఓపెనింగ్ సెర్మనీ వేడుకలు కూడా అద్బుతమైన లైటింగ్ షో… బాలీవుడ్ తారల ఆటపాటలతో వైభవంగా జరుగుతొంది.
మరికొద్ది క్షణాల్లో, ఈడెన్ గార్డెన్స్ వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్ – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగే మొదటి మ్యాచ్‌తో ఈ క్యాష్-రిచ్ లీగ్ ప్రారంభమవుతుంది. ఇక నేటి మ్యాచ్ లో కేకేఆర్ – ఆర్సీబీ జట్లు నయా సారథులతో బరిలోకి దిగడం విశేషం. వెటరన్ బ్యాటర్ అజింక్యా రహానే కెప్టెన్సీలో నాలుగో టైటిల్ గెలవడమే లక్ష్యంగా కేకేఆర్… యువ ప్లేయర్ రజత్ పాటిదార్ నాయకత్వంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఆర్‌సీబీ బరిలోకి దిగుతోంది.