ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌పై బీసీసీఐ రెండేళ్ల నిషేధం విధించేందుకు సిద్ధమైంది. ఢిల్లి క్యాపిటల్స్ ఆటగాడు బ్రూక్ ఇటీవల ఐపీఎల్-2025 సీజన్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. రాబోయే సిరీస్‌ల దృష్ట్యా జాతియ జట్టుకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఐపీఎల్ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు బ్రూక్ పేర్కొన్న విషయం తెలిసిందే.
ఐపీఎల్ నుంచి తప్పుకోవడం బ్రూక్‌కు వరుసగా ఇది రెండోసారి. గతేడాది కూడా ఇలాగే ఇంగ్లండ్ స్టార్ ఐపీఎల్ లీగ్ నుంచి వైదొలిగాడు. అయితే, ఇప్పుడు ఐపీఎల్ రూల్స్ మారాయి.
కొత్త నిబంధనల ప్రకారం.. వేలంలో అమ్ముడుపోయిన ఆటగాడు సరైర కారణం లేకుండా ఐపీఎల్ నుంచి వైదొలిగితే అతడిపై రెండేళ్ల బ్యాన్ పడుతుంది. ఈ క్రమంలోనే బీసీసీఐ బ్రూక్‌పై కఠిన చర్యలకు సిద్ధమైందని సమాచారం.
అతడిపై రెండేళ్ల వేటు పడుతుందని భారత క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. కాగా, ఇటీవల నిర్వహించిన ఐపీఎల్ మెగా వేలంలో ఢిల్లి ఫ్రాంచైజీ రూ. 6.25 కోట్ల భారీ ధరతో హ్యారీ బ్రూక్‌ను కోనుగోలు చేసింది.