IPL | రాజ‌స్థాన్ వ‌ర్సెస్ హైద‌రాబాద్

IPL | రాజ‌స్థాన్ వ‌ర్సెస్ హైద‌రాబాద్

IPL | ఆంధ్ర‌ప్ర‌భ, వెబ్‌డెస్క్ : ఐపీఎల్ 2026లో మ‌రో భీక‌ర పోరుకు హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం సిద్ధ‌మైంది. రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌, స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఢీకొన‌నున్నాయి. వరుసగా నాలుగు విజయాలతో సూప‌ర్ ఫామ్‌లో ఉన్న రాజస్థాన్ రాయల్స్‌ను ఢీకొనేందుకు హైద‌రాబాద్ సిద్ధ‌మైంది. ఉప్ప‌ల్‌లో నువ్వా నేనా అన్న‌ట్లు పోరాడేందుకు ఈ రెండు జ‌ట్లు రెడీ అయ్యాయి. ఇక హైద‌రాబాద్ జ‌ట్టు ఆడిన నాలుగు మ్యాచ్ లలో ఒకటే మాత్ర‌మే గెలిచింది. ఈ రోజు జ‌రిగే మ్యాచ్ హైద‌రాబాద్ జ‌ట్ట‌కు చాలా కీల‌కం.. ఇందులో గెలిచి పాయింట్ల ప‌ట్టిక‌లో ముందుకు పోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. ఐపీఎల్‌లో రాజ‌స్థాన్‌పై సన్ రైజర్స్ దే పైచేయిగా ఉంది. ఇరు జట్ల మధ్య ఐపీఎల్ లో గతంలో 21 మ్యాచ్ లు జరిగితే ఇందులో సన్ రైజర్స్ అత్యధికంగా 12 మ్యాచ్ లలో గెలిచి ఆధిక్యంలో ఉంది. రాజస్థాన్ రాయల్స్ 9 మ్యాచ్ లలో గెలిచింది. అయితే ప్ర‌స్తుత ఫామ్‌ను చూస్తే రాజస్థాన్‌ను ఓడించ‌డం అంత ఈజీ కాద‌నిపిస్తోంది. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ విధ్వంసాన్ని అడ్డుకోక‌పోతే హైద‌రాబాద్ జ‌ట్టు గెల‌వ‌డం క‌ష్ట‌మే. ఇషాన్ కిష‌న్ నేతృత్వంలో హైద‌రాబాద్ జ‌ట్టు టేబుల్ టాప‌ర్ రాజ‌స్థాన్‌ను ఓడించాలంటే ఆల్‌రౌండ్ షో చేయాల్సిందే.

ఇషాన్ కిషన్ సారథ్యంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ జ‌ట్టు గ‌త మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ చేతిలో ఘోరంగా ఓడిపోయింది. ఆ మ్యాచ్‌లో హైద‌రాబాద్ జ‌ట్టు 219 పరుగులు చేసినా ఓడిపోయింది. మరోవైపు గ‌త మ్యాచులో ఆర్సీబీని చిత్తుగా ఓడించి రాజస్థాన్ రాయల్స్చే మంచి ఊపు మీద ఉంది. ఈ మ్యాచులో వైభవ్ సూర్యవంశీ సునామీ ఇన్నింగ్స్ ఆడాడు. 26 బంతుల్లోనే 78 పరుగుల చేసి జ‌ట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ఉప్ప‌ల్‌ స్టేడియంలోని పించ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుంది. భారీ స్కోర్లు న‌మోద‌య్యే అవ‌కాశం ఉంటుంది. బ్యాట‌ర్లు కూడా బౌల‌ర్ల‌పై ఆధిప‌త్యం చ‌లాయించే అవ‌కాశం ఉంటుంది. హైద‌రాబాద్ జ‌ట్టులోని అభిషేక్ శ‌ర్మ‌, రాజ‌స్థాన్ జ‌ట్టులోని వైభవ్ సూర్యవంశీ చెల‌రేగే చాన్స్ ఉంది. అయితే ఈ ఇద్ద‌రిని ఎలా అడ్డుకోవాలా అని ఇరు జ‌ట్లు క‌స‌ర‌త్తు చేస్తున్నాయి.

సన్ రైజర్స్ ఎలెవెన్ : ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (C & WK), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, శివంగ్ కుమార్, హర్షల్ పటేల్, ఎషాన్ మలింగ. ఇంపాక్ట్ ప్లేయర్: జయదేవ్ ఉనద్కత్, లియామ్ లివింగ్‌స్టోన్, శివమ్ మావి, ప్రఫుల్ హింగే, కమిందు మెండిస్.

రాజస్థాన్ రాయల్స్ ఎలెవెన్ : వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్ (WK), రియాన్ పరాగ్ (సి), షిమ్రాన్ హెట్మెయర్, డోనోవన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నాంద్రే బర్గర్, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్. ఇంపాక్ట్ ప్లేయర్: లువాన్-డ్రే ప్రిటోరియస్, రవి సింగ్, శుభమ్ దూబే, తుషార్ దేశ్‌పాండే, బ్రిజేష్ శర్మ

Leave a Reply