interruption | మంచు అడ్డంకి.. గాల్లోనే సింగపూర్ విమానం చక్కర్లు

interruption | గన్నవరం – ఆంధ్రప్రభ : పొగమంచు కారణంగా గన్నవరం ఎయిర్ పోర్టులో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. శనివారం ఉదయం సింగపూర్ నుంచి వచ్చిన విమానం వాతావరణం అనుకూలించకపోవడంతో ల్యాండింగ్ కు వీలుపడక గాల్లోనే చక్కర్లు కొట్టింది. రన్వే సరిగ్గా కనిపించకపోవడంతో పైలట్లు విమానాన్ని దించలేకపోయారు. వాతావరణం మెరుగుపడిన తర్వాతే ల్యాండింగ్ కు అనుమతిస్తామని, ప్రయాణికులు ఎవరూ ఆందోళన చెందవద్దని ఎయిర్ పోర్టు వర్గాలు వెల్లడించాయి.

Leave a Reply