మంత్రి దామోదర్ కు విజ్ఞప్తి
హైదరాబాద్ : సూరారం అంబేద్కర్ భవనంలో జరిగిన సమావేశంలో దళిత సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు డాక్టర్ భుదాల అమర్ బాబు (Bhudala Amar Babu) మాట్లాడుతూ… గత టీఆర్ఎస్ ప్రభుత్వం దళితులను పూర్తిగా మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్‌లకు నిధులు కేటాయించకుండా “దళిత బంధు” పేరుతో దళితుల వద్ద నుండి డబ్బులు లాగి, ఆ పథకాన్ని దుర్వినియోగం చేశారని ఆయన ఆరోపించారు.
ప్రజా ప్రభుత్వంలో దళితుల గౌరవాన్ని పెంచాలని, కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ దళితుల పక్షాన నిలిచిందని, ఇందిరమ్మ దళితుల ఆరాధ్యదైవమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహారావుకు దళిత సంక్షేమ సంఘం నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు.
దళిత కార్పొరేషన్లకు నిధులు కేటాయించి, వడ్డీలేని రుణాలను అందించాలంటూ మంత్రి దామోదర్ రాజనర్సింహారావు (Damodar Rajanarasimha) ను కోరారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ నేత బీ.సంజీవ్ రావు, దళిత సంక్షేమ సంఘం యువజన విభాగం జాతీయ అధ్యక్షులు బీ.ఆనంద్ బాబు, ఆరు శ్రీను, సిహెచ్.గోపి, శ్రీను నాయక్ తదితర దళిత నాయకులు పాల్గొన్నారు.

