inter exames | పకడ్బందీగా పరీక్షలు

inter exames | పకడ్బందీగా పరీక్షలు
25వ తేదీ నుంచి ఇంటర్ ఎగ్జామ్స్
- కామారెడ్డి జిల్లాలో 37 పరీక్ష కేంద్రాలు
- మాస్ కాపీ లేకుండా సీసీ కెమెరాల పర్యవేక్షణ
- పరీక్షలకు హాజరుకానున్న17953 మంది విద్యార్థులు
- పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ఆం
- డీఐఈఓ అధికారి షేక్ సలాం
inter exames | బిక్కనూర్, ఆంధ్రప్రభ : ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కామారెడ్డి జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి షేక్ సలాం చెప్పారు. సోమవారం ఆయన ఆంధ్ర ప్రభతో మాట్లాడారు. ఈనెల 25 నుంచి వచ్చే నెల 17 వరకు ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సరం పరీక్షలు కొనసాగుతాయని తెలిపారు. ఈ పరీక్షల నిర్వహణ కోసం జిల్లాలో 37 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మొదటి సంవత్సరం జనరల్ విభాగంలో 7231 మంది, ఒకేషనల్ విభాగంలో 1782 మంది మొత్తం 9013 విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు ఆయన తెలిపారు. ద్వితీయ సంవత్సరం జనరల్ విభాగంలో 7149 మంది, ఒకేషనల్ విభాగంలో 1746 మంది మొత్తం 8946 విద్యార్థులు పరీక్ష రాయనున్నట్లు చెప్పారు.

ప్రథమ ద్వితీయ సంవత్సరం కలుపుకుని 17953 విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారని తెలిపారు. ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎలాంటి మాస్ కాపీ లేకుండా పరీక్షల నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. పరీక్షల నిర్వహణ కోసం 37 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 37 మంది డిపార్ట్మెంటల్ అధికారులను నియమించడం జరిగిందని వివరించారు. రెవెన్యూ, పోలీస్, ఇంటర్ విభాగం నుండి మూడుఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను నియమించడం జరిగిందని ఆయన తెలిపారు.
ప్రతి పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయడం జరుగుతుందన్నారు .పరీక్షా కేంద్రాలలో గోడ గడియారాలు మంచినీటి వసతి కల్పించడం జరుగుతుందని చెప్పారు. విద్యార్థులకు అనుకూలంగా ఉండే విధంగా ప్రతి పరీక్షా కేంద్రంలో బెంచీలు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఇన్విజిలేటర్లకు శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగిందన్నారు. నిమిషం ఆలస్యం అయినా విద్యార్థులను పరీక్షకు అనుమతి ఇవ్వాలని ఆయన సూచించారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా పరీక్ష తరగతి గదుల్లో అన్ని వసతులు కల్పించడం జరిగిందని ఆయన వివరించారు. పరీక్షా కేంద్రాలలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ఇంటర్ బోర్డుకు అనుసంధానం చేయడం జరిగిందని తెలిపారు.
