పల్లె దవాఖానాల పనులు త్వరగా పూర్తి చేయాలి
- హెల్త్ సబ్‌సెంటర్లను పరిశీలించిన డిప్యూటీ డీఎంహెచ్‌వో, ఎంపీడీవో
భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలంలోని జాగిర్యాల్, పిప్రి (జె), పల్లికొండ, బడా భీమ్‌గల్, చేంగల్ గ్రామాల్లో నిర్మిస్తున్న పల్లె దవాఖానా హెల్త్ సబ్‌సెంటర్లను డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ రవీందర్, ఎంపీడీవో గంగుల సంతోష్‌కుమార్ శనివారం సంయుక్తంగా సందర్శించారు. సబ్‌సెంటర్లలోని సౌకర్యాలను పరిశీలించారు.
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు హెల్త్ సబ్‌సెంటర్ల భవనాల నిర్మాణ పనులు, కాంట్రాక్టర్ పూర్తి చేసిన పనులు, ఇంకా మిగిలి ఉన్న పనులను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భవనాలను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అవసరమైన చర్యలపై వివరాలు సేకరించారు.

పల్లె దవాఖానాలు వినియోగంలోకి రావడానికి అవసరమైన విద్యుత్, మరుగుదొడ్లు, తాగునీరు తదితర మౌలిక వసతులపై అధికారులు పరిశీలన జరిపారు. ఆయా అంశాలపై సమగ్ర నివేదికను జిల్లా కలెక్టర్‌కు సమర్పించి, పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేసి పల్లె దవాఖానాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అజయ్, గ్రామ సర్పంచులు పిండి మనీషా (అశోక్), విష్ణువర్ధిని శంకర్‌గౌడ్, దుమాల మమత (రాజు), గడాల ప్రసాద్, అరిగెల జనార్దన్, హెల్త్ అధికారి సాయన్న, పంచాయతీ కార్యదర్శులు వినయ్, ప్రశాంత్, రాహుల్, ఆరోగ్య సిబ్బంది, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
