పారిశుద్ధ్య పనుల పరిశీలన..

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపాలిటీ 12వ వార్డులో పారిశుద్ధ్య పనులను కౌన్సిలర్ జెట్ట నీరజా సిద్ధులు శుక్రవారం పరిశీలించారు. వార్డు ప్రజలను కలుసుకొని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వార్డులో పారిశుద్ధ్య పరిస్థితులు మెరుగుగా ఉండేలా ఎప్పటికప్పుడు చూడాలని మున్సిపల్ సిబ్బందికి కౌన్సిలర్ సూచించారు. కౌన్సిలర్ వెంట స్థానిక నాయకులు ఉన్నారు.

Leave a Reply