Infosys-Public-Services-Ceo-Missing-Nepal-Floodదొర‌క‌ని ఆచూకీ Andhra Prabha Top News

Infosys-Public-Services-Ceo-Missing-Nepal-Flood
దొర‌క‌ని ఆచూకీ Andhra Prabha Top News

  • అడుగుడునా జ‌ల్లెడ‌
  • ఇన్ పోసిస్ దిగ్గ‌జం కోసం అన్వేష‌ణ‌
  • గంపెడు ఆశ‌తో ఫ్యామిలీ ఎదురు చూపు

(ఆంద్ర‌ప్ర‌భ‌, ఖాట్మాండు)

నేపాల్ మంచురాళ్ల వ‌ర‌ద‌లో గ‌ల్లంతైన‌.. భారతీయ సాఫ్ట్‌వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ అనుబంధ సంస్థ ‘ఇన్ఫోసిస్ పబ్లిక్ సర్వీసెస్’ సీఈఓ లక్ష్మీనాథ్ గోపిశెట్టి, ఆచూకీ కోసం కుటుంబ స‌భ్యులు అల్లాడిపోతున్నారు. ఆయ‌న బ‌తికి ఉన్నారో.. లేరో.. తెలియ‌క త‌ల్ల‌డిల్లిపోతున్నారు.

11 మంది బృందంతో కలిసి గోపిశెట్టి నేపాల్ వెళ్లారు. ఆ బృందంలో పది మంది అమెరిక‌న్లు ఒకరు కెనడా ఉద్యోగులు ఉన్నారు. వారం రోజులుగా ఆయ‌న జాడ కోసం అన్వేష‌ణ సాగుతోంది. ఇంత వ‌ర‌కూ ఆ 11 మంది ఆచైఊకీ ల‌భిచంచ‌క పోవ‌టంతో ఆచ‌న కుమార్తె శ్రేష్ఠ గోపిశెట్టి ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. .
వరద సమయంలో ఆయన నేపాల్-చైనా సరిహద్దులోని నేపాల్ ఇమిగ్రేషన్ కార్యాలయం వద్ద ఉన్నట్లు సమాచారం. “ఆ బృందం మొత్తం కనిపించకుండా పోయింది. వారిలో ఎవరి నుంచీ ఎటువంటి సమాచారం లేదు,
1981లో ఏర్ప‌డిన ఇన్ఫోసిస్ ప్రపంచంలోని అతిపెద్ద కన్సల్టింగ్ అవుట్‌సోర్సింగ్ సంస్థలలో ఒకటిగా ఎదిగింది. ‘ఇన్ఫోసిస్ పబ్లిక్ సర్వీసెస్’ అనేది డిజిటల్ మరియు కన్సల్టింగ్ సేవలను అందించే అమెరికాలోని ఒక అనుబంధ సంస్థగా అవ‌త‌రించింది. .గత వారం ఇన్ఫోసిస్ ప్రకటన ప్ర‌కారం, గోపిశెట్టి వ్యక్తిగత పర్యటనలో నేపాల్ వెళ్లారని స్ప‌ష్టం చేసింది. గ‌త వారం నుండి తమకు ఎటువంటి కొత్త సమాచారం అందలేదని ఆయ‌న కుమార్తె శ్రేష్ఠ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. .
భారతీయ నేపాలీ అధికారులతో తమకున్న పరిచయాలతో సమాచారం కోసం ప్రయత్నిస్తున్నారని, అమెరికా ప్రభుత్వాన్ని కూడా సంప్రదించారని ఆమె తెలిపారు. సమాచారం లేనప్పటికీ, ఆ కుటుంబం ఇంకా ఆశతోనే ఉంది. ఎక్కడో ఒకచోట సురక్షితం , రక్షణ కోసం ఎదురుచూస్తున్నారని ఆమ‌న కుమార్గె్ ఆశాభావం వ్య‌క్తం చేశారు. .