నాగార్జునసాగర్, ఆంధ్రప్రభ : నాగార్జున సాగర్ (Nagarjuna Sagar)కు ఇన్‌ఫ్లో తగ్గడంతో గేట్లు అన్నిమూసివేశారు. ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు అధికారులు నమోదు చేసిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎంత నీరు చేరుతుందో అంతే స్థాయి నీరు విడుదల చేస్తున్నారు. పూర్తి స్థాయి నీటి మట్టానికి 0.90 అడుగులు తక్కువగా ఉంది. అలాగే పూర్తిస్థాయి నీటి నిల్వకు 2.6892 టీఎంసీలు తక్కువగా ఉంది.
వివరాలు
మొత్తం అవుట్ ఫ్లో : 54676 క్యూసెక్కులు
నదిలోకి చేరుతున్న నీరు (ఇన్‌ఫ్లో): 54676 క్యూసెక్కులు
పూర్తి నీటి సామర్థ్యం : 590 అడుగులు
ప్రస్తుతం నీటి సామర్థ్యం : స్థాయి: 589.10 అడుగులు
పూర్తి స్థాయి నీటి నిల్వ : 312.0450 టీఎంసీలు
ప్రస్తుత నీటి నిల్వ ః 309.3558 టీఎంసీలు
కుడి కాలువ ద్వారా విడుదల : 9700 క్యూసెక్కులు
ఎడమ కాలువ ద్వారా విడుదల : 9349 క్యూసెక్కులు
ప్రధాన విద్యుత్ కేంద్రానికి నీటి విడుదల : 32927 క్యూసెక్కులు
నదిలోకి విడుదల : 32927 క్యూసెక్కులు

