ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 10,07, 530 క్యూసెక్కులు
మహాదేవపూర్, ఆంధ్రప్రభ : గత వారం రోజుల నుండి తెలంగాణ (Telangana) రాష్ట్రంతో పాటు మహారాష్ట్రలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు కాళేశ్వరం వద్ద ప్రాణహిత, గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.
గోదావరి (Godavari) లో 12. 370 మీటర్ల ఎత్తు నీరు ప్రవహిస్తున్నాది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక (First Flood Warning Issued) జారీ చేశారు. మరో మీటర్ ప్రవాహం పెరిగితే డేంజర్ లెవెల్ మొగుతుంది. ఒక్క గంటకు 00.150 మీటర్ల ఎత్తు గోదావరి నది ప్రవాహం పెరుగుతుంది. ఇప్పటికే అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. జాలర్లు ఎవరు చేపల వేటకు గోదావరిలోకి వెళ్లొద్దని, రైతులు పశువుల కాపర్లు గోదావరి వైపు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు.
మేడిగడ్డ బ్యారేజ్ (Medigadda Barrage) కు భారీగా వరద నీరు 10,07 530 క్యూసెక్కులు చేరడంతో మేడిగడ్డ బ్యారేజ్ 85 గేట్లు ఓపెన్ చేసి దిగువకు 10,07 530 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.
