నిత్య అన్నదానానికి రూ.1.11 లక్షల విరాళం
దాతల నుంచి విరాళం స్వీకరించిన చైర్మన్ బొర్రా రాధాకృష్ణ
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం నిత్య అన్నదాన పథకానికి భక్తులు రూ.1,11,111 విరాళం అందజేశారు. ఏలూరు మండలం పెదపాడు గ్రామానికి చెందిన భక్త దంపతులు జి. సదానంద భాస్కర్రావు, భారతీదేవి ఈ విరాళాన్ని సమర్పించారు. దాతలు అందజేసిన విరాళాన్ని దుర్గగుడి పాలకమండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ) స్వీకరించి, దేవస్థానం తరఫున రశీదు అందజేశారు. నిత్య అన్నదాన పథకానికి భక్తులు అందిస్తున్న సహకారం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా దాతలకు ఆలయ అధికారులు అమ్మవారి దర్శనం కల్పించారు. ప్రత్యేక పూజల అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం అందజేశారు. చైర్మన్ బొర్రా రాధాకృష్ణ దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, విరాళం రశీదును అందజేశారు.
