అమ్మవారి అలంకరణకు పట్టుచీరల సమర్పణ

దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రికి కానుక

ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో నిర్వహించనున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారి అలంకరణకు అవసరమైన పట్టు చీరలను సమర్పించారు. విజయవాడకు చెందిన ఆర్‌. చిరంజీవిరావు ఆధ్వర్యంలో వివిధ రకాల పట్టు చీరలను బుధవారం దేవస్థానం ఈవో శీనా నాయక్‌కు అందజేశారు. దసరా ఉత్సవాల్లో శ్రీ కనకదుర్గమ్మవారి అలంకరణతో పాటు పూజా మండపంలోని ఉత్సవమూర్తి అలంకరణకు ఈ చీరలను వినియోగించనున్నట్లు తెలిపారు.

ఉత్సవాల సందర్భంగా అమ్మవారి అలంకరణకు పట్టు చీరలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉండటంతో భక్తులు, దాతలు వాటిని సమర్పిస్తున్నారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఈ చీరలను వినియోగించనున్నారు. కార్యక్రమంలో దేవస్థానం ప్రధాన అర్చకులు కోట ప్రసాద్‌ పాల్గొన్నారు.