Indrakeeladri | దుర్గమ్మ ఆలయనికి రికార్డు స్థాయి ఆదాయం..

Indrakeeladri | దుర్గమ్మ ఆలయనికి రికార్డు స్థాయి ఆదాయం..

  • 2026-28 సంవత్సరానికి సంబంధించి వేలంపాట..
  • గత టెండర్ రూ 5.68 కోట్లు..
  • ప్రస్తుత టెండర్ రూ 10.10 కోట్లు..

Indrakeeladri | ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే అత్యంత ప్రాధాన్యత కలిగిన రెండో దేవస్థానమైన ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానానికి ఈ ఏడాది టెండర్ (Tender) ప్రక్రియ ద్వారా అత్యధిక ఆదాయం సమకూరింది. అమ్మవారికి భక్తులు అత్యంత పవిత్రంగా సమర్పించే కేశఖండనశాలకు సంబంధించి నిర్వహించిన టెండర్ ప్రక్రియ గతంలో కంటే అత్యధికంగా వేలంపాట ద్వారా ఆదాయం లభించింది.

Indrakeeladri | విజయవాడ ఇంద్రకీలాద్రి పై..

విజయవాడ ఇంద్రకీలాద్రి పై కేశఖండన శాల వెంట్రుకల వేలం ప్రక్రియ పూర్తి కాగా సుమారు 80% మేర దేవస్థానానికి ఆదాయం (income) పెరిగింది. భక్తులు సమర్పించే వెంట్రుకల విక్రయానికి సంబంధించి రెండేళ్ల కాల పరిమితి (2026-2028) కు గాను నిర్వహించిన టెండర్ ప్రక్రియ సోమవారం నిర్వహించగా గత టెండర్లతో పోలిస్తే.. ఈసారి దేవస్థానానికి భారీ స్థాయిలో ఆదాయం సమకూరింది.

Indrakeeladri

Indrakeeladri | టెండర్ ప్రక్రియ..

ఈ టెండర్ ప్రక్రియను ఆలయ ఈఓ, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ (Collector) వి.కె. సీనా నాయక్ పర్యవేక్షణలో నిర్వహించారు. పబ్లిక్ ఆక్షన్ లో ఇందులో 19 మంది వ్యాపారులు పాల్గొన్నారు. సీల్డ్ టెండర్ లో 13 షెడ్యూల్స్ విక్రయించగా, 4 గురు పాల్గొన్నారు. ఇందులో ప్రోద్దుటూరుకు చెందిన కె.వి. నరసమ్మ రూ. 9,57,00,000/- తో అత్యధిక ధర పలికారు. ఈ-టెండర్ లో 4 గురు పాల్గొనగా, తిరుపతికి చెందిన గరుడ ఎంటర్‌ప్రైజెస్ రూ. 9,09,99,999/- కోట్ చేశారు. రెండేళ్ల టెండర్ ప్రక్రియలో పశ్చిమ గోదావరి జిల్లా, తణుకుకు చెందిన ఇండియన్ హెయిర్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ (మేనేజింగ్ డైరెక్టర్: వి. రవీంద్ర నాథ్) అత్యధిక ధరకు టెండర్‌ను దక్కించుకున్నారు.

Indrakeeladri

Indrakeeladri | రికార్డు స్థాయిలో ఆదాయం..

గత టెండర్ కాలం (2024-26) తో పోలిస్తే.. ప్రస్తుత వేలంలో దేవస్థానానికి (Temple) రికార్డు స్థాయిలో ఆదాయం పెరిగింది. గతంలో రూ. 5,67,57,000/- ఉండగా, ఇప్పుడు అది రూ. 10,10,00,000/- కు చేరింది. సుమారు 77.96% పెరుగుదల కనిపించగా రెండవ ఏడాది గతంలో రూ. 6,18,05,700/- ఉండగా, 10% అదనపు పెంపుతో కలిపి రూ. 11,11,00,000/- కు చేరింది. దింతో సుమారు 80.08% పెరుగుదల స్పష్టంగా కనిపిస్తుంది. పారదర్శకంగా నిర్వహించిన ఈ వేలం ప్రక్రియ ద్వారా దేవస్థానానికి గతంతో పోలిస్తే భారీగా ఆదాయం పెరగడం పట్ల అధికారులు ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ) సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

CLICK HERE TO READ వైకుంఠ ఏకాదశి శోభ..

CLICK HERE TO READ MORE

Leave a Reply