గోసంరక్షణకు రూ.1 లక్ష విరాళం..

గోసంరక్షణకు రూ.1 లక్ష విరాళం..
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడ లోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం గో సంరక్షణ కోసం గోసంరక్షణ పథకానికి భక్త కుటుంబం రూ.1 లక్ష విరాళాన్ని అందజేసింది. భక్తురాలు పి. సుభాషిణి కుటుంబ సభ్యులు మాధవరావు, రేవంత్ సాయి చౌదరి, హేమంత్ సాయి చౌదరి, రామబాబు, వరలక్ష్మ దేవస్థానం నిర్వహిస్తున్న గో సంరక్షణ కార్యక్రమానికి రూ.1,00,000 విరాళంగా సమర్పించారు.
దుర్గగుడి చైర్మన్ బొర్రా గాంధీని కలిసి దాతలు విరాళాన్ని అందజేశారు. వీరికి ఆలయ అధికారుల అమ్మవారి దర్శనం ఏర్పాట్లు చేయక వేద ఆశీర్వచనమంతరావు అధికారులు అమ్మవారి చిత్రపటం రసీదు ప్రసాదాలు అందజేశారు.
