Indrakeeladri | అత్యంత వైభవంగా మహా కుంభాభిషేకం..

Indrakeeladri | అత్యంత వైభవంగా మహా కుంభాభిషేకం..
వేసవి దృష్ట్యా చలువ పందిళ్లు, త్రాగునీటి సదుపాయాలు
అవసరం అయిన క్యూ లైన్లు, పార్కింగ్ ఏర్పాట్ల..
భక్తులకు అసౌకర్యం అన్ని సదుపాయాలు..
దుర్గగుడి ఈవో శీనా నాయక్
Indrakeeladri | ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో జరగనున్న మహా కుంభాభిషేకం ఉత్సవాల ఏర్పాట్లను దేవస్థానం కార్యనిర్వహణాధికారి వి.కె. సీనా నాయక్ శనివారం సాయంత్రం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఎండ వేడి తగలకుండా ఆలయ పరిసరాల్లో వెంటనే చలువ పందిళ్లు ఏర్పాటు చేయాలని ఆయన ఇంజనీరింగ్ విభాగానికి ఆదేశించారు. భక్తుల కోసం తగినంత త్రాగునీటి సదుపాయం కల్పిస్తూ, వాటర్ ప్లాంట్లు నిరంతరం పనిచేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూ కాంప్లెక్స్ నిర్మాణ పనులను సమీక్షించిన ఈఓ, రథం సెంటర్ నుంచి కనకదుర్గ నగర్ వరకు పార్కింగ్ ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. క్యూ లైన్లలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నాణ్యమైన సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించే ఈ మహా కుంభాభిషేకం ఉత్సవాలు మార్చి 6 నుంచి 8 వరకు వైభవంగా జరగనున్నాయి. భక్తుల రాకపోకలకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు సమగ్రంగా చేపట్టాలని ఈఓశీనా నాయక్ స్పష్టం చేశారు.

