ఇందిర‌మ్మ ఇల్లు ప్రారంభం

ఇందిర‌మ్మ ఇల్లు ప్రారంభం

మోత్కూర్, (ఆంధ్ర‌ప్ర‌భ) : యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలో లబ్ధిదారురాలు ఇక్కిరి కృష్ణవేణి నిర్మించుకున్న ఇందిరమ్మ ఇల్లును ఎమ్మెల్యే మందుల సామెల్ ఈ రో్జు గృహ‌ప్ర‌వేశం కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. తుంగతుర్తి నియోజకవర్గంలోని తొలి ఇందిరమ్మ ఇల్లును తన చేతుల మీదుగా ప్రారంభించడం సంతోషకరంగా ఉంద‌ని ఎమ్మెల్యే సామెల్ అన్నారు. గృహప్రవేశంలో భాగంగా రిబ్బన్ కట్ చేసి, కొబ్బరికాయ కొట్టి నూతన ఇల్లును ఎమ్మెల్యే ప్రారంభించారు.

అనంతరం కృష్ణవేణికి స్వీట్ తినిపించి నూతన వస్త్రాలు అందజేశారు. మినహా లబ్ధిదారులు త్వరితగతిన ఇండ్ల నిర్మాణం పూర్తి చేసేలా అధికారులు ప్రోత్సాహించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తుందన్నారు. రూ.5 లక్షలతో నియోజకవర్గంలో 3,500 ఇండ్ల చొప్పున దశల వారీగా ఇండ్లు మంజూరు అవుతాయన్నారు. గత ప్రభుత్వాలు పేదలకు ఒక్క ఇల్లు కూడా నిర్మించిన పాపాన పోలేదని ఎమ్మెల్యే విమర్శించారు.

Leave a Reply