ఇండ్లు మంజూరు చేసి ఆదుకుంటాం..
కడం అక్టోబర్ 25 ఆంధ్రప్రభ – రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ పథకం అమలు చేస్తుందని.. పేదలను ఆదుకుంటుందని ఖానాపూర్ ఎమ్మెల్యే వేడమ బొజ్జు పటేల్ అన్నారు. శనివారం కడెం మండలంలోని చిన్న బెల్లాల్ గ్రామంలో గల తోటిగూడెం గిరిజనులకు ప్రభుత్వం నుండి మంజూరైన ఇందిరమ్మ పథకం ఇండ్ల మంజూరు పత్రాలను ఖానాపూర్ ఎమ్మెల్యే వేడమ బొజ్జు పటేల్ అందజేసారు. అలాగే ఇండ్ల నిర్మాణం పనులకు భూమి పూజ చేసారు.
ఈ సందర్భంగా ఖానాపూర్ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం నుండి ఇండ్లు మంజూరైన పేదలు సకాలంలో ఇళ్ల నిర్మాణం పనులు చేపట్టాలన్నారు. ప్రభుత్వం గిరిజనుల సంక్షేమం కోసం పాటుపడుతుందన్నారు. గిరిజనుల సమస్యలను పరిష్కరించడానికి తమ వంతు కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ నిర్మల్ జిల్లా పిడి రాజేశ్వర్, కడం ఎంపీడీవో బి అరుణ, ఈజీఎస్ ఏపీఓ జయదేవ్, కడం ఎమ్ ఆర్ ఐ శారద, హౌజింగ్ ఏఈ వంశీ, జిపిఓ విజయకుమార్, పాండవపూర్ పిఎసిఎస్ డైరెక్టర్ గోళ్ళ వెంకటేష్, ఖానాపూర్ ఆత్మ కమిటీ డైరెక్టర్ డి రాజశేఖర్, కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు టి శంకర్, ఖానాపూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దయానంద్, కాంగ్రెస్ పార్టీ కడెం మండల నాయకులు ఆకుల లచ్చన్న, రాజేశ్వర్, సౌధాని, రాజన్న యాదవ్, వన్నెల సత్తన్న స్థానిక పంచాయతీ కార్యదర్శి గిరిధర్ వెంకు పటేల్ లింభారావు తదితరులు పాల్గొన్నారు.

