Indian Medicines | చైనాలో భార‌తీయ ఫార్మా కంపెనీల‌కు మ‌నుగ‌డ‌!

  • 55 ర‌కాల మందుల స‌ర‌ఫ‌రాకు కుదిరిన కాంట్రాక్ట్‌

వెబ్ డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ : భార‌తీయ ఫార్మా కంపెనీల‌కు చైనాలో మ‌నుగ‌డ సాధించేందుకు సిద్ధ‌మ‌వుతున్నాయి. చైనా ఉత్ప‌త్తి చేసే మందుల‌ ( Medicines ) పై అనేక దేశాలు ఆధార‌ప‌డి ఉన్నారు. ఈ త‌రుణంలో ఇండియాలో ఉత్ప‌త్తి అవుతున్న మందుల‌ను చైనా కొనుగోలు చేయ‌డం విశేషం. ప్ర‌ధానంగా యాంటీఇన్ఫెక్టివ్స్, యాంటీట్యూమర్, అలెర్జీ, మరికొన్ని ఇతర వ్యాధుల చికిత్సల్లో వినియోగించే దాదాపు 55 రకాల మందుల సరఫరా కోసం చైనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ గత నెలలో బిడ్డింగ్ ప్రక్రియ చేపట్టింది. దీని కోసం ప్రాథమికంగా 272 కంపెనీలను ఎంపిక చేశారు. భారతీయ ఫార్మా కంపెనీలు ఏడు రకాల మందుల సరఫరా కాంట్రాక్టులను సొంతం చేసుకోగలిగాయి.

Indian Medicines | చైనా మార్కెట్లో అడుగుపెట్టిన ఇండియన్

భార‌త‌దేశీయ ఔషధ కంపెనీలు చైనాలో విస్తరిస్తున్నాయి. చైనాలో బల్క్ జనరిక్ ఔషధాల సరఫరా కాంట్రాక్టులు సంపాదించడంతో పాటు షుగర్ వ్యాధిని అదుపు చేయడానికి వినియోగించే మందు అందించడంలో ముందుంటున్నాయి. చైనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన మందుల సమీకరణ కాంట్రాక్టుల్లో సిప్లా, డాక్టర్ రెడ్డీస్, నాట్కో ఫార్మా, అన్నోరా పార్మా, హెటిరో ల్యాబ్స్ పాల్గొని కొన్ని కాంట్రాక్టులు కుదుర్చుకున్నాయి. ఇండియా-చైనా ఎకనామిక్ అండ్ కల్చరల్ కౌన్సిల్ (ఐసీసీ) ఈ విషయాన్ని వెల్లడించింది.

Medicines

ట్యాబ్లెట్ల సరఫరా కాంట్రాక్టు సంపాదించిన ఏడు పార్మా కంపెనీల్లో హెటిరో ల్యాబ్స్, సిషా ఉన్నాయి. వాల్యూమ్ బేస్డ్ ప్రొక్యూర్మెంట్ (ఏబీపీ) బిడ్డింగ్ విధానం ప్రకారం ఈ కంపెనీలకు చైనాలోని కొన్ని ప్రావిన్స్ కు ట్యాబ్లెట్లు సరఫరా చేసే కాంట్రాక్టులు దక్కాయి. అక్సాకార్బజెపైన్ ట్యాబ్లెట్ సరఫరా కాంట్రాక్టు అన్నోరా పార్మాకు, ఒలాపారిజ్ ట్యాబ్లెట్లు సరఫరా చేసే కాంట్రాక్టు నాట్కో పార్మాకు లభించాయి. బల్క్ ఔషధాలు, ఏపీఐ (యాక్టివ్ ఫార్మా ఇన్డేడియంట్స్) లను బాగా తక్కువ ధరకు మించడంలో చైనా కంపెనీలు అగ్రగామిగా ఉన్నాయి.

భారతీయ ఫార్మా కంపెనీలు బల్క్ ఔషధాల కోసం చైనా మీద ఆధారపడుతున్నాయి. ఈ క్ర‌మంలో చైనాలో మందుల సరఫరా బిడ్లు ద‌క్కించుకోవ‌డం సామాన్య విషయం కాదని పరిశ్రమ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. దాదాపు ప‌ది భారతీయ ఫార్మా కంపెనీలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. త్వరితంగా మందుల రిజిస్ట్రేషన్లు సాధించడమే కాకుండా, తక్కువ స‌మ‌యంలో మందులు ఉత్పత్తి చేసి మార్కెట్‌లో విడుదల చేయగలిగితేనే భారతీయ కంపెనీలు లో మనుగడ సాధించగలుగుతాయి.

Trump H1B | భార‌త్‌పై సుంకాలు త‌గ్గించ‌నున్న అమెరికా

Leave a Reply