Indian Constitution | పంతులమ్మలకు సన్మానం

Indian Constitution | పంతులమ్మలకు సన్మానం

Indian Constitution | నిజామాబాద్ జిల్లా రెంజల్, ఆంధ్రప్రభ : భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే 195వ జయంతిని పురస్కరించుకొని బహుజన సమాజ్ పార్టీ బోధన్ అసెంబ్లీ(Assembly) ఆధ్వర్యంలో మండల కేంద్రంలో జిల్లా పరిషత్ పీఎంశ్రీ ఉన్నత పాఠశాల మహిళా ఉపాధ్యాయులకు ఘన సన్మానం చేశారు. శాలువా, పూలమాలలు వేసి సత్కరించారు.

ఈ సందర్భంగా ఎంఈఓ కట్టా ఆంజనేయులు మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ(Indian Constitution) నిర్మాత అయినటువంటి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు గురువులు మహాత్మ జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే ఆదర్శప్రాయులని, వారు చూపిన బాటలో మనమందరం నడవాలని, చిన్నచిన్న చదువులే కాకుండా ఉన్నతమైనటువంటి చదువులు చదివి ఎదగాలని అప్పుడే సావిత్రిబాయి త్యాగాలకు నివాళులర్పించినట్లని అన్నారు.

బహుజన సమాజ్ పార్టీ(Bahujan Samaj Party) జిల్లా ప్రధాన కార్యదర్శి సంతోష్,బోధన్ అసెంబ్లీ ఇంచార్జ్ నీరడి రవి, అసెంబ్లీ కన్వీనర్ అధ్యక్షులు రమేష్ దాస్ మాట్లాడారు. సన్మానించిన వారిలో కమరున్నిసా, అనురాధ, నౌషిన్, విజయ, వాజిదాతబసుం, ఫాసియా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులను సన్మానించారు. రెంజల్ మండల అధ్యక్షుడు భూమయ్య, పిఆర్టియు మాజీ ప్రధాన కార్యదర్శి ఏనుగు శ్రావణ్ కుమార్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు నాందేవ్, ఉపాధ్యాయులు సుధాకర్, ముత్తయ్య, శంకర్, రాకేష్, శ్రీనివాస్ రెడ్డి విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply