ఓవల్: ఓవల్ (Oval) లో భారత్ వర్సెస్ ఇంగ్లండ్ (India vs England) జట్ల మధ్య జరుగుతున్న ఐదవ టెస్ట్ మ్యాచ్ (Fifth Test Match) లో తొలి ఇన్నింగ్స్ లో భారత్ జట్టు ఆలౌట్ (All out) అయ్యింది. ఇంగ్లండ్ బౌలర్లు చుట్టేశారు. ఆ పేసర్ల ధాటికి ఓవల్ టెస్టు (ENGvIND)లో ఇండియా తన ఫస్ట్ ఇన్నింగ్స్ (First innings) లో 224 పరుగులకే ఆలౌటైంది.
ఆరు వికెట్ల నష్టానికి 204 పరుగల వద్ద రెండో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన ఇండియా.. రెండో రోజు కేవలం మరో 20 రన్స్ జోడించి చేతులెత్తేసింది. నైట్ బ్యాటర్లు కరుణ్ నాయర్ (Karun Nair), వాషింగ్టన్ సుందర్ (Washington Sundar) లు త్వరగా నిష్క్రమించడంతో.. టెయిలెండర్లు స్కోరు బోర్డును పరుగెత్తించలేకపోయారు. ఇంగ్లండ్ బౌలర్ అట్కిన్‌సన్ (Gus Atkinson) 33 రన్స్ ఇచ్చి అయిదు వికెట్లు తీసుకున్నాడు. రెండో రోజు కేవలం అరగంటలోనే భారత్ ఇన్నింగ్స్‌ను ముగించేశారు. కరుణ నాయర్ 57, సుందర్ 26 రన్స్ చేసి ఔటయ్యారు. ఇక సిరాజ్, ప్రసిద్ధి కృష్ణ డకౌట్ అయ్యారు. కీలకమైన నాయర్ వికెట్‌ను టాంగ్ తీసుకున్నాడు.