India Rafale Deal 2026 | ప్రపంచాన్ని వణికించేలా భారత దేశ రక్షణ రంగ వ్యవస్థ
- 114 రఫేల్స్‌లో 94 జెట్లు- స్థానికంగా ఉత్పత్తి
- సంసిద్ధత వ్యక్తం చేస్తూ ఫ్రాన్స్ ప్రతిపాదన
- దేశీయ రక్షణ తయారీ రంగానికి మోడీ సర్కారు ఊతం
- భారత్ అమ్ముల పొదిలో 190 అణు వార్‌హెడ్లు.. తయారీ దశలో మరో 35
హైదరాబాద్, ఆంధ్రప్రభ పొలిటికల్ బ్యూరో : దేశీయ రక్షణ రంగాన్ని బలోపేతం చేసే దిశగా కీలక ముందడుగు పడింది. భారత వాయుసేన కోసం తలపెట్టిన రూ.3.25 లక్షల కోట్ల మెగా రఫేల్ డీల్‌లో (India Rafale Deal 2026) భాగంగా అందించాల్సిన 114 యుద్ధ విమానాల్లో 94 జెట్లను భారత్‌లో తయారు చేసేందుకు ఫ్రాన్స్ సంసిద్ధత వ్యక్తం చేస్తూ అధికారిక ప్రతిపాదన సమర్పించింది.
ఇది కార్యరూపం దాలిస్తే ఫ్రాన్స్ వెలుపల రఫేల్ యుద్ధ విమానాలు తయారవడం ఇదే తొలిసారి కానుంది. భారత్ ఈ ఏడాది మే నెలలో 114 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించిన లెటర్ ఆఫ్ రిక్వెస్ట్ (ఎల్‌వోఆర్)ను ఫ్రాన్స్‌కు పంపింది. దానికి ప్రతిస్పందనగా ఆ దేశం తాజాగా ఈ పూర్తిస్థాయి ప్రతిపాదనను భారత్‌కు సమర్పించింది.
దీనిలో భారత్‌లో తయారీ, సాంకేతికత బదిలీ, స్వదేశీ ఆయుధాల అనుసంధానానికి అధిక ప్రాధాన్యతనిచ్చింది. ప్రస్తుతం రక్షణ మంత్రిత్వ శాఖ, వాయుసేనకు చెందిన అక్విజిషన్ విభాగం ఈ ప్రతిపాదనను నిశితంగా పరిశీలిస్తున్నాయని రక్షణశాఖ వర్గాలు తెలిపాయి.
కాగా, ఫ్రాన్స్ ప్రతిపాదనల్లో ముఖ్యమైనది తాను అందించాల్సిన 114 రఫేల్ యుద్ధ విమానాల్లో 94 జెట్లను భారత్‌లోనే స్థానిక సంస్థల భాగస్వామ్యంతో తయారు చేయడం. ఈ కార్యక్రమంలో దసో ఏవియేషన్‌తో పాటు ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ రక్షణ సంస్థలైన ఎంబీడీఏ, సాఫ్రాన్, థేల్స్ కూడా భాగస్వామ్యం కానున్నాయి.
ఈ ప్రాజెక్టు భారత ఏరోస్పేస్ రంగానికి గొప్ప ఊపునిస్తుందని.. టాటా, ఎల్ అండ్ టీ వంటి భారతీయ కంపెనీలు, ఇతర దేశీయ రక్షణ రంగ సంస్థలకు అపారమైన అవకాశాలు కల్పిస్తుందని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టు కింద పరిశ్రమల భాగస్వామ్యంతో సుమారు రూ.1.6 లక్షల కోట్ల వ్యాపారం జరగవచ్చని అంచనా.
మేకిన్ ఇండియాలో భాగంగా తయారు చేసే రఫేల్ ప్లాట్‌ఫామ్‌లో స్వదేశీ ఆయుధ వ్యవస్థలను.. ముఖ్యంగా అస్త్ర మిస్సైల్ రకాలను అనుంధానించే నిబంధనలపై ఫ్రాన్స్ చేసిన ప్రతిపాదనను భారత్ నిశితంగా పరిశీలిస్తోంది. గాలి, నేల, సముద్రం – ఈ మూడు మార్గాల ద్వారా ఒకేసారి అణ్వాయుధాలను ప్రయోగించగల ‘న్యూక్లియర్ ట్రయాడ్’ వ్యవస్థలను భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చేస్తోందని హాన్స్ క్రిస్టెన్సెన్ అన్నారు. 2026 ప్రారంభం నాటికి భారత్ వద్ద సుమారు 730 కిలోల వెపన్- గ్రేడ్ ప్లుటోనియం ఉన్నట్లు అంచనా వేశారు.
ఒక్కో వార్‌హెడ్‌కు 4 కిలోల ప్లుటోనియం అవసరం అనుకున్నా ఈ నిల్వలు 140 నుంచి 225 వార్‌హెడ్ల తయారీకి సరిపోతాయని తెలిపారు. అయితే భారత్ తన వద్ద ఉన్న ప్లుటోనియం మొత్తాన్ని ఆయుధాల తయారీకే వాడకపోవచ్చని, కొంత రిజర్వ్‌గా ఉంచుకునే అవకాశం ఉందని తెలిపారు.
భారత్ వద్ద ప్లుటోనియం నిల్వలు ఎంత?
2026 ప్రారంభం నాటికి భారత్ వద్ద సుమారు 730 కిలోల వెపన్-గ్రేడ్ ప్లుటోనియం ఉన్నట్లు అంచనా వేశారు. ఒక్కో వార్‌హెడ్ తయారీకి సుమారు 4 కిలోల ప్లుటోనియం అవసరమని భావిస్తే, ఈ నిల్వలు భవిష్యత్తులో 140 నుండి 225 అణు వార్‌హెడ్‌లను తయారు చేయడానికి సరిపోతాయి. అయితే, భారత్ తన వద్ద ఉన్న మొత్తం ప్లుటోనియాన్ని కేవలం ఆయుధాల తయారీకే పూర్తిగా ఉపయోగించకపోవచ్చని, భవిష్యత్తు అవసరాల కోసం కొంత భాగాన్ని రిజర్వ్‌గా ఉంచుకునే అవకాశం ఉందని ఆయన విశ్లేషించారు.
ఆయుధ సంపత్తిని క్రమంగా పెంచుకుంటున్నప్పటికీ, భారత్ తన ప్రాథమిక విదేశాంగ, రక్షణ విధానాలకు మాత్రం ఎప్పుడూ కట్టుబడి ఉంది. 1998లో నిర్వహించిన పోఖ్రాన్- అణుపరీక్షల తర్వాత భారత్ అధికారికంగా ‘నో ఫస్ట్ యూజ్’ (ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుగా అణ్వాయుధాలను ప్రయోగించబోం) సిద్ధాంతాన్ని ప్రకటించింది. తమ వద్ద ఉన్న అణ్వాయుధాలు కేవలం శత్రు దేశాల దాడులను నిలువరించడానికి మాత్రమే ఉపయోగపడతాయని భారత ప్రభుత్వం పార్లమెంటు వేదికగా అనేకసార్లు స్పష్టం చేసింది.
ప్రస్తుతం మరికొన్ని నూతన క్షిపణి వ్యవస్థలు వివిధ దశల్లో అభివృద్ధిలో ఉన్నందున, రాబోయే రోజుల్లో భారత్ అణ్వాయుధాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని రక్షణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
అణ్వాయుధాలు ఉన్న దేశాలు తొమ్మిది
అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, యుద్ధ వాతావరణం కారణంగా ఇటీవలి కాలంలో చాలా దేశాలు తమ సైనిక సామర్థ్యాలను బలోపేతం చేసుకుంటున్నాయి. ప్రధాన అణు శక్తి దేశాలన్నీ తమ ఆయుధ సంపత్తిని, క్షిపణి వ్యవస్థలను ఆధునీకరించుకునే పనిలో నిమగ్నమయ్యాయి. అత్యధిక సంఖ్యలో అణ్వాయుధాలు కలిగి ఉన్న దేశాల జాబితాలో అమెరికా, రష్యా తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి.
స్టాక్‌హోమ్ అంతర్జాతీయ శాంతి పరిశోధన సంస్థ నివేదిక ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా అణ్వాయుధాలు కలిగి ఉన్న దేశాలు మొత్తం తొమ్మిది మాత్రమే ఉన్నాయి. ఈ తొమ్మిది దేశాల వద్ద కలిపి 12 వేలకు పైగా అణ్వాయుధాలు అందుబాటులో ఉన్నాయి. కేవలం ఏడాది వ్యవధిలో భారత్ మరో 10 వార్‌హెడ్లను అదనంగా సమకూర్చుకుని తన ఆయుధాగారాన్ని బలోపేతం చేసుకుంది. చైనా విషయానికి వస్తే, ఆ దేశం వద్ద ఏకంగా 620 అణ్వాయుధాలు ఉన్నట్లు సిప్రి నివేదికలో వెల్లడించింది.
భారత వాయుసేనకు రఫేల్ చాలా కీలకం..
భారత్ ఇప్పటికే పాతబడిన మిగ్ యుద్ధ విమానాలను దశల వారీగా ఉపసంహరించుకుంటోంది. అలాగే తేలికపాటి యుద్ధ విమానాలైన ఎల్‌సీఏ ఎంకే1ఏ, త్వరలో అందుబాటులోకి రానున్న ఎల్‌సీఏ ఎంకే2 వంటి స్వదేశీ విమానాలను సమకూర్చుకోవడంలో జాప్యం కారణంగా స్క్వాడ్రన్ బలం తగ్గుతోంది. ఈ లోటును అత్యాధునిక రఫేల్స్‌తో భర్తీ చేయాలనేది భారత్ లక్ష్యం.
ఈ క్రమంలో 2024లో చేసిన 114 రఫేల్ జెట్ల కొనుగోలు ప్రతిపాదనకు రక్షణ సేకరణ మండలి… 5నెలల క్రితం ఆమోదం తెలిపింది. భారత వాయుసేన, నౌకాదళం కోసం ఇప్పటికే 62 రఫేల్ యుద్ధ విమానాలకు ఆర్డర్లు ఇచ్చారు. ప్రతిపాదిత 114 రఫేల్స్ కొనుగోలు ప్రక్రియ పూర్తయితే.. భారత్ వద్ద ఉండే రఫేల్స్ సంఖ్య 176కి పెరుగుతుంది. అలాగే భారత నౌకాదళం కూడా తన విమాన వాహక యుద్ధ నౌకల కోసం 31 రఫేల్-ఎం రకం యుద్ధ విమానాలు కావాలని కోరింది.
