బోట్స్‌వానాకు భారత్‌ ఔషధ సాయం..

  • 10 టన్నుల యాంటీ రెట్రోవైరల్‌ మందులు

ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ : ఆఫ్రికా దేశమైన బోట్స్‌వానాకు 10 టన్నుల యాంటీ రెట్రోవైరల్‌ (ARV) ఔషధాలను భారత్‌ సహాయంగా పంపించింది.
ఈ విషయాన్ని భారత విదేశాంగ మంత్రి డాక్టర్‌ ఎస్‌. జైశంకర్‌ వెల్లడించారు. బోట్స్‌వానా అభ్యర్థన మేరకు ఈ ఔషధాలను పంపినట్లు ఆయన తెలిపారు. నాణ్యమైన, అందుబాటు ధరల్లో మందులను అందించడంతో పాటు గ్లోబల్‌ సౌత్‌ దేశాలతో ఆరోగ్య రంగంలో సహకారాన్ని మరింత విస్తరించేందుకు భారత్‌ కట్టుబడి ఉందని పేర్కొన్నారు.