- మెరిసిన సిరాజ్
లార్డ్స్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు రెండో రోజు ఆటలో ఇంగ్లాండ్ తమ తొలి ఇన్నింగ్స్ ను 387 పరుగుల వద్ద ముగించింది. జో రూట్ తన క్లాసిక్ ఆటతీరుతో ఆకట్టుకుంటూ 192 బంతుల్లో 10 బౌండరీలతో సెంచరీ (100) పూర్తి చేశాడు. అయితే, 104 పరుగుల వద్ద బుమ్రా అద్భుతంగా చెలరేగి రూట్‌ను పెవిలియన్‌కి పంపించాడు.
అంతకుముందు జో రూట్‌కి తోడుగా కెప్టెన్ స్టోక్స్ 44 పరుగులు చేయగా, వీరిద్దరి మధ్య 88 పరుగుల భాగస్వామ్యం నిలిచింది. స్టోక్స్ కూడా బుమ్రా బౌలింగ్‌లోనే అవుట్ అయ్యాడు. ఇక రూట్ తర్వాత వచ్చిన క్రిస్ వోక్స్ ఖాతా తెరవకముందే బుమ్రా చేతిలో వికెట్ ఇచ్చేశాడు.
దీంతో లంచ్ సమయానికి ఇంగ్లాండ్ 353/7గా నిలిచింది. అప్పటికే కీలక భాగస్వామ్యంతో చెలరేగుతున్న స్మిత్-కార్సే జోడిని సిరాజ్ విడదీశాడు. జేమీ స్మిత్ (51) ను సిరాజ్ పెవిలియన్ చేర్చగా, ఆర్చర్ (4) ను బుమ్రా వెనక్కి పంపాడు. చివరి వికెట్‌గా బ్రైడెన్ కార్సే (56) ను సిరాజ్ అవుట్ చేసి ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ను ముగించాడు.
బుమ్రా ఈ ఇన్నింగ్స్‌లో 5 కీలకమైన వికెట్లు తీసి ఇంగ్లాండ్‌పై మరోసారి నిప్పులు చెరిగాడు. డేంజరస్‌గా ఆడుతున్న స్మిత్-కార్సే లను ఔట్ చేసి సిరాజ్ సామర్థ్యాన్ని మరోసారి నిరూపించాడు.
ఇక ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ ముగిసిన నేపథ్యంలో, భారత్ త్వరలోనే తన తొలి ఇన్నింగ్స్ ప్రారంభించనుంది.
మూడో టెస్ట్ తొలి రోజు ఇలా..
టాస్ గెలిచి బ్యాటింగ్ కు వచ్చిన ఆతిథ్య జట్టుకు జాక్ క్రాలీ, బెన్ డకెట్ జాగ్రత్తగా ఆరంభాన్ని అందిస్తుండగా, డ్రింక్స్ బ్రేక్ తర్వాత నితీశ్ కుమార్ రెడ్డి ఒకే ఓవర్‌లో బెన్ డకెట్ (23), జాక్ క్రాలీ (18) పెవిలియన్‌కి పంపించాడు. ఆ తరువాత జో రూట్ – ఓల్లి పోప్ కలిసి మూడో వికెట్‌కు 109 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
కానీ టీ విరామం తరువాత జడేజా పోప్(44) ను వెనక్కి పంపాడు. ఆ తరువాత వచ్చిన హ్యారీ బ్రూక్ కి బుమ్రా షాకిచ్చాడు. 11 పరుగులకే వద్ద బ్రూక్ ని అవుట్ చేసి టీమిండియాను మళ్లీ గేమ్‌లోకి తెచ్చాడు. ఆ తర్వాత రూట్-స్టోక్స్ జోడీ నెమ్మదిగా ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లి, తొలి రోజు ఆట ముగిసే సమయానికి స్కోరు బోర్డును 251/4 వద్ద ముగించింది.
ఇక రెండో రోజు ఉదయం రూట్ తన 37వ టెస్టు శతకం, భారత్‌పై 11వ శతకం పూర్తి చేసుకున్నాడు. అయితే, ఆ వెంటనే బుమ్రా విజృంభించి స్టోక్స్, రూట్, క్రిస్ వోక్స్‌లను వరుసగా అవుట్ చేసి ఇంగ్లాండ్ ను 271/7కి కుదించాడు.
భారత్‌కు ప్రమాదకరంగా మారిన స్మిత్-కార్సీలను సిరాజ్ వెనక్కి పంపాడు. కార్సీ చివరి వికెట్‌గా వెనుదిరగ్గా… దానికి ముందు, బుమ్రా ఆర్చర్‌ను బౌల్డ్ చేశాడు. ఆర్చర్ వికెట్‌తో బుమ్రా ఫైఫర్ వికెట్ నమోదు చేశాడు.