లండన్ : ఓవల్ టెస్ట్ తొలి రోజు పూర్తిగా బౌలర్ల ఆధిపత్యంతో సాగింది. పిచ్, వాతావరణ పరిస్థితులు పూర్తిగా బౌలర్లకు అనుకూలించాయి. అయితే, ఇంగ్లాండ్ బౌలింగ్ దాడిలోనూ కరుణ్ నాయర్ ధైర్యంగా ఎదురీదుతూ భారత ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నంలో నిలిచాడు. ఒత్తిడిలో మైదానంలోకి వచ్చిన నాయర్, తన కెరీర్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడుతున్నాడు.
టాస్ కోల్పోయిన భారత్, బ్యాటింగ్ కు దిగింది వచ్చింది. ఇంగ్లాండ్ పేసర్లు వాతావరణం సపోర్ట్‌తో దుకూడు చూపించారు. మ్యాచ్ ప్రారంభం నాల్గో ఓవర్‌కే యశస్వి జైస్వాల్ (2) గస్ అట్కిన్సన్ బౌలింగ్‌కు ఎల్బీడబ్ల్యూగా వెనుదిరగడం భారత్‌కు తొలి ఎదురుదెబ్బగా నిలిచింది. ఆ తరువాత క్రిస్ వోక్స్ తన రెండో స్పెల్‌లో కేఎల్ రాహుల్(14)ను బౌల్డ్ చేయడంతో భారత్ మరింత ఒత్తిడిలో పడింది.
శుభ్‌మన్ గిల్(21) – సుధర్శన్ (38) ఓ దశలో ఇన్నింగ్స్‌ను స్థిరపరచే ప్రయత్నం చేశారు. గిల్ అద్భుతంగా బాల్ టైమింగ్ చేస్తూ, ఇంగ్లండ్ బౌలర్లను ఎదుర్కొనడంతో మ్యాచ్ మళ్లీ బ్యాలెన్స్ అవుతుందా అన్న ఆశలు చిగురించాయి. కానీ మధ్యలో వర్షం రావడంతో లంచ్ బ్రేక్ ముందుగానే రావాల్సి వచ్చింది.
మళ్లీ ఆట ప్రారంభమైన తర్వాత కేవలం ఆరు ఓవర్లు మాత్రమే సాగే సమయంలోనే, గిల్ రన్‌ఔట్ కావడం భారత్‌కి పెద్ద షాక్ ఇచ్చింది. ఆ తరువాత సుధర్శన్, రవీంద్ర జడేజా(9)లు పెవిలియన్ చేరారు. దీంతో భారత స్కోరు బోర్డు 123/5 వద్ద నిలిచింది. ఈ కష్టసమయంలో మిగిలిన ఆటగాళ్లు తడబడినా, కరుణ్ నాయర్ (52) ఒంటరిగా నిలబడ్డాడు.
ప్రస్తుతం క్రీజులో నాయర్ తో పాటు సుందర్ (19)తో ఉన్నాడు. తొలి రోజు ముగిసే సరికి భారత్ స్కోర్ 204/6.