మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య..

జైపూర్, నవంబర్ 05 (ఆంధ్రప్రభ): జైపూర్ మండలం క్రిష్టాపూర్ గ్రామంలో మద్యానికి బానిసై ఒకరు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై భూమేష్ తెలిపిన వివరాల ప్రకారం క్రిష్టాపూర్ గ్రామానికి చెందిన సముద్రాల శంకర్ (30) అనే వ్యక్తి గత కొంత కాలంగా మద్యానికి బానిసై ఆరోగ్యం క్షీణించిందని జీవితంపై విరక్తి చెందాడని తెలిపారు. కాగా శంకర్ ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే శంకర్ను చికిత్స నిమిత్తం ప్రవేట్ వాహనంలో మంచిర్యాలకు తీసుకెళ్తుండగా మార్గం మద్యలో 108 అంబులెన్స్ రావడంతో అందులో ఎక్కించే క్రమంలో 108 సిబ్బంది పరిశీలించగా అప్పటికే శంకర్ మృతి చెందినట్లు తెలిపారు. మృతుని భార్య సముద్రాల లావణ్య పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై భూమేష్ పేర్కొన్నారు.