ఇంతకీ.. ఎందుకో తెలుసా..?

ఇంతకీ.. ఎందుకో తెలుసా..?

(ఆంధ్రప్రభ – కృష్ణా ప్రతినిధి ):
తుఫాను నేపథ్యంలో కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు శివారు కృష్ణాపురం వద్ద నీట మునిగిన వరి పంట పొలాలను ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించారు. గురువారం ఉదయం 8:30 గంటలకు మంగళగిరి నుంచి రోడ్డు మార్గంలో అవనిగడ్డ నియోజకవర్గానికి ఆయన వచ్చారు. 10.30 గంటలకు కోడూరు శివారు కృష్ణాపురం వద్ద ఉన్న ఆర్సీఎం చర్చి సమీపంలోని నేలకొరిగిన వరి పంట పొలాలను పరిశీలించారు. 11:30 గంటలకు కోడూరు నుంచి మంగళగిరి క్యాంపు కార్యాలయానికి రోడ్డు మార్గంలో బయలుదేరినట్లు అధికారులు తెలియజేశారు.

ఇందుకు సంబంధించి కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే.బాలాజీ, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి ఇప్పటికే పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. నియోజకవర్గానికి తొలిసారిగా పవన్ కళ్యాణ్ రావడంతో పార్టీ శ్రేణులు ఆయనకు సాదర స్వాగతం పలికేందుకు ముమ్మర ఏర్పాట్లు చేశారు. ఆయన పరిశీలించే పంట పొలాల ప్రాంతాన్ని మార్కింగ్ చేసి అధికారులు ఏర్పాట్లు చేశారు. కోడూరు మండలంలో 15 వేల ఎకరాల్లో వరి పంట సాగు చేయగా, 7 ఎకరాల వరకు తుఫాను కారణంగా వరి పంట నేలకొరిగినట్లు రైతులు వాపోతున్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అవనిగడ్డ నియోజకవర్గంలో వరి పంటను పరిశీలించడం పట్ల రైతులు ఆనందం వ్యక్తం చేశారు.

Leave a Reply