వెంకటేశ్వర్లపల్లిలో మెయిన్‌ రోడ్డు పనులకు శ్రీకారం

  • అభివృద్ధి పనులతో రాకపోకలకు మెరుగైన సౌకర్యం

రేగొండ, ఆంధ్రప్రభ : జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కొత్తపల్లిగోరి మండలం వెంకటేశ్వర్లపల్లి గ్రామంలో మెయిన్‌ రోడ్డు నిర్మాణ పనులు శనివారం ప్రారంభమయ్యాయి. గ్రామ సర్పంచ్‌ కాడవేన సరిత–యుగేందర్‌ ఆధ్వర్యంలో రహదారి పనులకు శ్రీకారం చుట్టారు.

గ్రామంలోని ప్రధాన రహదారి అభివృద్ధి పనులు పూర్తయితే ప్రజలకు రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి. వాహనదారులకు ఇబ్బందులు తగ్గడంతో పాటు గ్రామానికి మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి రానుంది. గ్రామాభివృద్ధిలో భాగంగా మెయిన్‌ రోడ్డు పనులు ప్రారంభం కావడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.

కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ పున్నం రాజు, వార్డు సభ్యులు, పంచాయతీ సిబ్బంది, బీఆర్‌ఎస్‌ గ్రామ కమిటీ అధ్యక్షుడు బానోతు రావణ్‌ నాయక్‌, ఆవుల రమేశ్‌, మాజీ సర్పంచ్‌ చిగురుమామిడి రజిత–రాజు, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు చిగురుమామిడి కుమారస్వామి, కాంగ్రెస్‌ గ్రామ కమిటీ అధ్యక్షుడు బోయిని కుమారస్వామి, గట్టు సురేష్‌, కారోబార్‌ రాజు, నాండ్రె శ్రీనివాస్‌, బీస సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.