Imprisonment | బంగ్లాదేశ్ మాజీ ప్ర‌ధాని షేక్ హ‌సీనాకు ఆరు నెల‌లు జైలు శిక్ష

డాకా , బంగ్లాదేశ్ (Bangladesh ) మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనాకు (sheik Hasina ) ఆ దేశ న్యాయస్థానం బిగ్ షాక్ ఇచ్చింది. కోర్టు ధిక్కార కేసులో ఆరు నెలల (six months) జైలు శిక్ష విధించిందని అక్కడి స్థానిక మీడియా కథనాలు ప్రచురించాయి. అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ (tribunal ) ఈ తీర్పును ప్రకటించినట్లు ఢాకాకు చెందిన పలు మీడియా సంస్థలు వార్తలు వెలువరించాయి.

ఇక, అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్-1 చైర్మన్ జస్టిస్ ఎం.డి. గోలం మోర్టుజా మొజుందర్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఆరు నెలల జైలు శిక్షను ఖరారు చేసింది. అలాగే, గైబంధ జిల్లా గోవిందగంజ్‌కు చెందిన షకీల్ అకాండ్ బుల్బుల్‌కు రెండు నెలల జైలు శిక్ష విధించింది. బుల్బుల్ ఢాకాకు చెందిన రాజకీయవేత్తగా, అధికార అవామీ లీగ్ పార్టీకి చెందిన విద్యార్థి విభాగమైన బంగ్లాదేశ్ ఛత్ర లీగ్ తో సంబంధం కలిగి ఉన్నాడు. గత ఏడాది అక్టోబర్‌లో షేక్ హసీనా మరియు షకీల్ బుల్బుల్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణ లీక్ కావడం, దానిపై ఆధారాలు వెలుగులోకి రావడంతో ఆమెపై కోర్టు ధిక్కార కేసు నమోదు అయింది.

అయితే, గత ఏడాది బంగ్లాదేశ్ లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనకర పరిస్థితులతో ప్రధాని పదవి కోల్పోయి, దేశం వదిలిన షేక్‌ హసీనా.. భారత్‌లో ప్రస్తుతం ఆశ్రయం పొందుతుంది. ఈ క్రమంలో ఆమెతో పాటు అప్పటి నేతలు, సలహాదారులు, సైనికాధికారులపై యూనస్ ప్రభుత్వం అనేక కేసులు నమోదు చేసింది. ఢాకా కేంద్రంగా ఉన్న ఇంటర్నేషనల్‌ క్రైమ్స్‌ ట్రైబ్యునల్ ఇప్పటికే ఆమెకు అరెస్టు వారెంట్‌ సైతం జారీ చేసింది. ఆమెను బంగ్లాకు రప్పించేందుకు మహమద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక సర్కార్ అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజా పరిణామం చోటుచేసుకుంది.

Leave a Reply