కరోనాపై పోరులో మరో దేశీయ వ్యాక్సిన్ త్వరలో అందుబాటులోకి రానుంది. దేశంలో ఇప్పటికే కొవాగ్జిన్, కోవిషీల్డ్, స్పుత్నిక్ వీ, మోడెర్నా వంటి వ్యాక్సిన్‌లకు డీసీజీఐ అనుమతులు జారీ చేసింది. వీటిలో మోడెర్నా వ్యాక్సిన్ ఇంకా అందుబాటులోకి రాలేదు. అయితే గుజరాత్‌లోని జైడస్ క్యాడిలా ఫార్మా నుంచి మరో వ్యాక్సిన్ అందుబాటులోకి రాబోతోంది. డీఎన్ఏ ఆధారిత వ్యాక్సిన్ ఇది. కరోనాకు డీఎన్ఏ బేస్ మీద తయారు చేసిన తొలి వ్యాక్సిన్ జైకోవ్ డీ కావడం విశేషం. ఈ వ్యాక్సిన్ అత్యవసర వినియోగం కోసం జైడస్ క్యాడిలా డీసీజీఐకు దరఖాస్తు చేసుకుంది.
ఏటా 120 మిలియన్ డోసుల ఉత్పత్తి సామార్థ్యం కంపెనీకి ఉంది. ఇండియాలోని కరోనా వ్యాక్సిన్ కోసం క్లినికల్ ట్రయల్ నిర్వహించింది. ఇండియాలోని 12 ఏళ్ల నుండి 18 ఏళ్ల వయసు ఉన్నవారిలో ఈ వ్యాక్సిన్‌ను పరీక్షించారు. కోవిడ్ కేసులపై ఈ టీకా 66.6 శాతం సమర్థవంతంగా పనిచేస్తుందని, మిగిలిన వారిపై 100 శాతం ప్రభావవంతంగా ఉందని జైడస్ క్యాడిలా తెలిపింది.
ఇది కూడా చదవండి: తెలంగాణలో తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు