Tuesday, November 26, 2024

గ్యాస్ ధరల పెంపుపై జెడ్పీటీసీ నిరసన.. కట్టెల పొయ్యిపై వంట!

గ్యాస్ సిలిండర్ ధరల పెంపును నిరసిస్తూ పెద్దపల్లి జిల్లా పాలకుర్తి జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి శుక్రవారం నిరసన వ్య‌క్తం చేశారు. విపరితంగా పెరుగుతున్న గ్యాస్ ధరలను నిరసిస్తూ తన ఇంట్లో ఖాళీ సిలిండర్ పై కూర్చుని కట్టెల పొయ్యి మీద వంట చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 2014లో ఎన్డీఏ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన సమయంలో 410 రూపాయలున్న గ్యాస్ సిలెండ‌ర్‌ ధర ప్రస్తుతం 1105 రూపాయలకు చేరుకుందన్నారు.

పెట్రో ఉత్పత్తులతో పాటు గ్యాస్ ధరల పెంపు వల్ల సామాన్యులు పస్తులు ఉండాల్సిన పరిస్థితి నెల‌కొంద‌ని సంధ్యారాణి విమ‌ర్శించారు. తెలంగాణ ప్రభుత్వం నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే కేంద్రం మాత్రం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడటం సిగ్గుచేటని మండిప‌డ్డారు. పెంచిన గ్యాస్ సిలెండ‌ర్ ధ‌ర‌లు త‌గ్గించి మ‌హిళ‌ల‌కు ఇబ్బంది లేకుండా చేయాల‌ని డిమాండ్ చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement