ప్రస్థుతం అంతా డెలివరీల కాలం నడుస్తోంది. నిత్యం ఏది కావాలన్న ఆన్ లైన్ లో ఆర్డర్ ఇస్తే చాలు ఇంటికి వచ్చేస్తుంది. కాగా ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జోమాటో మరోసారి కీలక నిర్ణయం తీసుకున్నది. నిత్యవసర వస్తువుల డోర్ డెలివరీ నుంచి పక్కకు తప్పుకున్నది. కరోనా నుంచి కోలుకుంటుండటంతో ఫుడ్ డెలివరీకి డిమాండ్ పెరుగుతున్నది. నిత్యవసర వస్తువుల డోర్ డెలివరీ కంటే, ఫుడ్ డెలివరీకే వినియోగదారులు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో నిత్యవసర సేవల డోర్ డెలివరీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది. గతేడాది ఓసారి ఈ నిర్ణయం తీసుకోగా, జులై నెలలో ఈ సేవలను తిరిగి ప్రారంభించింది. అయితే, ఇప్పుడు ఫుడ్ డెలివరీకి డిమాంట్ పెరుగుతున్న నేపథ్యంలో నిత్యవసర వస్తువుల సేవలనుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement